పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2.యాకోబు మోసంతో యేసావు జ్యేష్ఠభాగం కొట్టేసి మేనమామ దగ్గరికి పారిపోయాడు గదా! అతడు తన భార్యా బిడ్డలతో తిరిగిరాగా యేసావు తమ్మునికి ఎదురువోయాడు. అన్నయెదురు వస్తున్నాడని విని యాకోబు హడలిపోయాడు. యేసావు దగ్గరికివచ్చి ఏడుసారులు నేలమీదికి వంగి దండం పెట్టాడు. యేసావు తమ్ముణ్ణి క్షమించాడు. అతన్ని కౌగిలించుకొని ముద్దాడాడు. అతని భార్యాపిల్లలను ఆదరంతోజూచాడు.-ఆది 33, 1-4.

3. ఓ సేవకుడు తన యజమానునికి పెద్దమొత్తం బాకీ పడ్డాడు. అయినా యజమానుడు దయతలచి అతన్ని మన్నించాడు, ఆ సేవకునికి మరొకడు చిన్న మొత్తం బాకీ పడివున్నాడు. అయినా అతడు తన తోడిదాసుడ్డి మన్నించకుండా నా డబ్బు చెల్లిస్తావా లేక జైలుకి వెళ్లావా అని కుత్తిక పట్టుకొన్నాడు. యజమానునికి ఈ సంగతి తెలిసింది. అతడు తొలిసేవకుణ్ణి పిలపించి "దుర్మారుడా! నేను నిన్ను క్షమించినట్లే నీవూ తోడిదాసుడ్డి క్షమించవద్దా?" అని మండిపడ్డాడు. అతన్నికఠినంగా శిక్షించాడు గూడ- మత్త 18, 33.

4. సీమోను అనే పరిసయని ఇంటిలో క్రీస్తు విందారగిస్తూండగా ఓ పాపాత్మురాలు వచ్చి అతని పాదాలను కన్నీటితో తడిపి తలవెండ్రుకలతో తుడిచింది. ఆ పాదాలను భక్తిభావంతో మద్దిడుకొని వాటికి పరిమళ ద్రవ్యం పూసింది. ఇదంతా గమనిస్తున్న సీమోను “ఈమె పాపాత్మురాలుకదా! ఈలాంటి అయోగ్యురాలు తన్ను తాకుతుంటే క్రీస్తు చూస్తూ ఊరుకుంటాడేమిటి?" అనుకొన్నాడు. అతని తలపులెరిగి ప్రభువు " ఈమె అధికంగా ప్రేమించింది కనుక ఈమె చాల పాపాలు చేసినా అవన్నీ క్షమించబడ్డాయి" అన్నాడు. ఆమె గాఢమైన భక్తిభావం కలది కనుకనే తన పాపాలన్నిటికి క్షమాపణం పొందింది - లూకా 7, 47.

5. క్రీస్తు సిలువమీద వ్రేలాడుతూ తన్ను హింసించి చంపే శత్రువులకోసం ప్రార్థించాడు.“తండ్రీ వీళ్లేమిచేస్తున్నారో వీళ్లకే తెలియదు. వీళ్లను క్షమించు" అని మనవి చేసాడు...లూకా 23,34.

6. సైఫను ఏద్దరు పరిచారకుల్లో ఒకడు.అతడు మోషే ధర్మశాస్త్రమూ పూర్వవేద దేవాలయమూ ఇక మనలను రక్షింపలేవు,మనలను కాపాడేది ఉత్థానక్రీస్తేనని బోధించాడు. ఈ బోధ యూదుల యాజకులకు గిట్టలేదు.వాళ్ళు అతన్ని బలవంతంగా లాగుకొనివెళ్ళి యెరూషలేము పట్టణం వెలుపల రాళ్ళ రువ్వి చంపారు.అలా చనిపోతూగూడ సైఫను శత్రువులను దూషించలేదు. వాళ్లను క్షమించి వాళ్లకోసం ప్రార్ధించాడు."ప్రభో! ఈ పాపాన్ని వీళ్లమీద మోపవద్దు" అని దేవుణ్ణి మనవిచేసాడు.ఈ విధంగా అతడు క్రీస్తుచూపిన మార్గంలోనే పయనించాడు - అచ 7,59.