పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూజించుకొంటూండేది. ఆమె యేండ్లగడచిన వృద్ధురాలు, విధవ, ఉపవాసాలతో ప్రార్థనలు చేసికొంటూ దేవాలయాన్ని విడిచిపోయేదికాదు. ఆమె క్రీస్తు బిడ్డనుజూచి సంతోషంతో దేవునికి ధన్యవాదాలు అర్పించింది. అక్కడి భక్తులకు ఆ శిశువుని చూపించి యెరూషలేముకు రక్షణం కొనివచ్చేది యీ బిడ్డదేనని చెప్పింది. అలా ప్రభుదర్శనంవల్ల ఆ భక్తురాలి హృదయం ద్రవించిపోయింది — లూకా 2, 36–38.

12.స్నాపక యోహాను తల్లిదండ్రులు ఎలిసబేతు జకరియాలు.వీళ్లు వృద్దులు, భక్తులు. ప్రభువు మోషే ద్వారా యిచ్చిన ధర్మశాస్తాన్ని పాటిస్తూ నీతిమంతులుగా జీవిస్తుండేవాళ్లు - లూకా 1, 5–7.

13.కన్యమరియు మహా భక్తురాలు. ఆమె దేవదూత శుభవార్త ద్వారా దేవుని చిత్తాన్ని తెలిసికోగానే “ఇదిగో ప్రభువు దాసురాలిని. ఆయన చిత్తప్రకారమే జరగాలి? అంది. దేవుడు తన్ను కరుణించిన విధానాన్ని తలంచుకొని భక్తిపారవశ్యంతో "నేను పూర్ణహృదయంతో ప్రభుని స్తుతిస్తున్నాను. రక్షకుడైన దేవుణ్ణి తలంచుకొని నిండుమనస్సుతో ఆనందిస్తున్నాను" అని యొలిగెత్తిపాడింది. ప్రభువు ఆమె వినయాన్నీ భక్తిభావాన్నీ మెచ్చుకొన్నాడు. ఆమెకు తన రక్షణాన్ని ప్రసాదించాడు. కనుకనే సకల తరాలవాళూ ఆమెను ధన్యురాలు అని కొనియాడుతున్నారు -లూకా 1, 46-48.

23.క్షమాగుణం

తోడి జనాన్ని క్షమించాలి అంటే పాపపు మానవులమైన మనకెంతో కష్టంగా వుంటుంది. కనుక భగవంతుడు మనలను క్షమించి మనంకూడ ఇతరులను క్షమించాలని నేర్పాడు. తోడి జనాన్ని క్షమించినవాడు నరుబ్లాకాదు దేవుళ్లా ప్రవర్తిస్తాడు. అపరాధులను క్షమించడమనేది నూత్నవేదం బోధించే గొప్ప సత్యాల్లో ఒకటి. 1. సోదరులు యోసేపని బానిసగా అమ్మివేసారు గదా! అతడు ఐగుప్తలో ప్రధానాధికారి అయ్యాడు. కరువురాగా సోదరులు రెండుసారులు ధాన్యంకోసం యోసేపు వద్దకు వెళ్లారు. రెండవసారి యోసేపు నేనేమీ తమ్ముజ్జని సోదరులకు తెలియజేసికొన్నాడు. ఆ యున్నలు యోసేవుని అమ్మివేసినందుకు అతడు తమమీద పగతీర్చుకుంటాడేమోనని భయపడిపోయారు. కాని యోసేపువారితో “మీరు అనుమానపడకండి. ఆనాడు మీరు నాకు కీడు తలపెట్టారు. కాని ఈనాడు దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడు. నేను మీకంటె ముందుగా వచ్చి యిక్కడ ఉండబట్టే నేడు మీరు బ్రతకగలిగారు. నేను మిమ్మూ మీ పిల్లలనూ ఆదరిస్తాను.మీ యపరాధాన్ని పూర్తిగా క్షమిస్తాను" అని చెప్పాడు - ఆది 50, 18–21.