పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. ఓమారు ప్రభువు దేవాలయంలో బోధిస్తుండగా భక్తులువచ్చి కానుకల పెట్టెలో డబ్బు వేస్తున్నారు. ధనవంతులు మస్తుగా డబ్బు పడవేస్తున్నారు. అప్పడు ఓ పేద విధవ గూడవచ్చిరెండు పైసలు మాత్రం కానుక వేసింది. అది చూచి ప్రభువు శిష్యులతో "అందరికంటె ఈ పేదరాలు ఎక్కువదానం చేసింది. వాళ్లంతా సమృద్ధిగా ఉండి దానం చేసారు. కాని ఈమె లేమిలో ఉండిగూడ దానంచేసింది. తన జీవనాన్నేత్యాగంచేసి కొంది" అన్నాడు. భగవంతునికి మన వస్తువులతో పనిలేదు. అతనికి కావలసింది మన హృదయం. ఆ హృదయాన్నిభగవంతునికి సమర్పించుకొన్నవాడే భక్తుడు - మార్కు 12, 41-43.

8. లాజరు చనిపోయి మళ్ళా బ్రతికినాక ప్రభువు ఓమారు బెతానియా గ్రామానికి వచ్చాడు. అతడు లాజరుతో విందారగిస్తుండగా మరియు పరిమళద్రవ్యం తీసికొనివచ్చి యేసు పాదాలపై కుమ్మరించింది. పరమ భక్తి భావంతో ఆ పవిత్ర పాదాలను తన తలవెండ్రుకలతో తుడిచింది. ఈ భక్తిక్రియ ద్వారా ఆమె యేసు భూస్థాపనాన్ని సూచించింది. - యోహా 12, 1-3.

9. ఇంకొక మారుగూడ ప్రభువు లాజరు ఇంటికి వచ్చాడు. మార్తతొందరపాటుతో భోజనం తయారు చేస్తుంది. కాని మరియమాత్రం ప్రభువుపాదాల చెంతనే గూర్చుండి నిమ్మళంగా అతని బోధ ఆలిస్తూంది. మార్త చిరాకుతో క్రీస్తు దగ్గరికివచ్చి "ఈ పనంతా నేనే చేసికోవాలి. చెల్లెలినిగూడ వచ్చి కాస్త సహాయం చేయమని చెప్పండి” అంది. కాని ప్రభువు "మార్త! నీవు ఏమేమో పనులు పెట్టుకొని సతమతమౌతూన్నావు. ఆతుర పడుతూన్నావు. కాని అవసరమైంది ఒక్కటే. భగవంతుని మీద హృదయం నిల్పుకోవడం. మరియు పరలోకంలోని దేవుని మీద మనసునిల్పి నా బోధలు ఆలిస్తూంది. ఆమెను కాదనడందేనికి?" అన్నాడు. అలా ఆ భక్తురాలు మరియు ప్రభువ మన్నలను అందుకొంది - లూకా 10, 32-42.

10. పౌలు పగటిపూట క్రీస్తునిగూర్చి బోధించేవాడు. రాత్రుల్లో డేరాబట్టలు కుట్టుకొని పొట్టకూడు సంపాదించుకొనేవాడు. అతడు ఎవరి డబ్బులమీద ఆధారపడలేదు. కాయకష్టంచేసి బ్రతికాడు. ఆకుల అనే యూద కుటింబీకుడూ అతని భార్య ప్రిస్కపౌలుని పరామర్శించేవాళ్లు.అతడు కొంతకాలం ఆ దంపతుల యింటనే తలదాచుకొన్నాడు. ఆనాటి క్రైస్తవులుగూడ ఈ పుణ్యదంపతుల యింట సమావేశమై ప్రార్థనలు జరుపుకొనేవాళ్ళు ఈ దంపతులు పౌలుకోసం ప్రాణాలు బలి యూయడానికిగూడ వెనుకాడలేదు. పౌలు ఈ భార్యాభర్తల భక్తి భావాన్ని వేనోళ్ళ కొనియాడాడు - రోమా 16, 3-5.

11. మరియా యోసేపలు క్రీస్తు శిశువుని యెరూషలేము దేవాలయంలో కానుక పెట్టడానికి కొనిపోయారు. ఆ రోజుల్లో అన్న అనే ప్రవక్తి దేవాలయానికివచ్చి ప్రభువుని