పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వధూవరుల్లో ఒకరు అక్రైస్తవులైతే ఆ కళ్యాణం దేవద్రవ్యానుమానంకాదు. కాని అలాంటి వివాహం కూడ పవిత్రమైందే. వారికి కలిగే బిడ్డలుకూడ పవిత్రులుగానే వుంటారు. అవిశ్వాసియైన భర్త తన క్రైస్తవ భార్యద్వారా, అవిశ్వాసియైన భార్య తన క్రైస్తవ భర్తద్వారా పరిశుద్దులౌతారు అన్నాడు పౌలు - 1కొ 7,14. ఐనా వివాహమాడే యిరువురూ జ్ఞానస్నానం పొందివుండడం సమంజసం.

క్రైస్తవులుకాని భార్యాభర్తలు జ్ఞానస్నానం పొందినపుడు వారి వివాహం కూడ దేవద్రవ్యానుమానం ఔతుంది.

8. వివాహంమిద తిరుసభకు అధికారం

వధూవరులే ఒకరికొకరు కల్యాణ సంస్కారాన్ని ఇచ్చుకొన్నా వారి వివాహంమీద తిరుసభకు అధికారం వుంటుంది. వాళ్ళకూడ తిరుసభలో భాగమే కదా! కనుక తిరుసభకు రక్తసంబంధం మొదలైన వివాహ ఆంక్షలు విధించే అధికారం వుంది.

పెండ్లి ఆధ్యాత్మిక రంగానికి మాత్రమేగాక లౌకికరంగానికికూడ చెందింది. కనుక ప్రభుత్వానికిగూడ దానిమీద అధికారం వుంది. ఆస్తి సంతానం మొదలైన విషయాల్లో వివాహితులమీద ప్రభుత్వాధికారం చెల్లుతుంది. ఈ రంగాల్లో గొడవలు వచ్చినపుడు మామూలుగా న్యాయస్థానం పరిష్కరిస్తుంది.\

ప్రార్ధనా భావాలు

1. ఆదామేవల అంగీకారం

సృష్ట్యాదిలో ఆదామేవలు ఒకరినొకరు భార్యాభర్తలనుగా అంగీకరించారు. దేవుడు ఏవను ఆదామునొద్దకు తీసికొనిరాగా అతడు "ఈమె నా యెముకల్లో ఎముక దేహంలో దేహం. ఈమె నరునినుండి రూపొందింది కనుక నారి ఔతుంది. కావున నరుడు సొంత తల్లిదండ్రులనుగూడ విడనాడి తన ఆలికి అంటిపెట్టుకొని వుంటాడు. వాళ్ళిద్దరూ ఏకశరీరమౌతారు" అని అనుకొన్నాడు. ఒకవిధంగా, ఈ యాదామేవల అంగీకారం నేడు గుడిలో పెండ్లిచేసికొనే మన వధూవరుల అంగీకారంమీద కూడ సోకుతుంది. ఆ తొలి అంగీకారం నేటి మన అంగీకారాన్ని పవిత్రం చేస్తుంది. ఆదామేవలు అందరికీ ఆదిమ మాతాపితలు.

2. ఒకరినొకరు నమ్మడం

వధూవరుల అంగీకారంలో ఒకరినొకరు నమ్మడమనే గుణం వుంటుంది. "వాళ్ళు "నేను నిన్ను భార్యగా - భర్తగా చేసుకుంటున్నాను. నీపట్ల విశ్వసనీయుడనుగా