పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్నెలు తమ దివ్వెలకు నూనె సిద్ధంచేసికొన్నారు. తెలివిలేని కన్నెలకు నూనెలేదు. పెండ్లికుమారుడు ఆలస్యం చేసినందున వాళ్ళంతా కొంచెంసేపు నిద్రపోయారు. అర్ధరాత్రికి పెండ్లికుమారుడు రాగా, ఆ కన్నెలందరూ లేచారు. అప్పడు తెలివైనవాళ్ళు నూనెపోసి దివ్వెలు వెలిగించుకొని అతనికి స్వాగతమిచ్చారు. వాళ్ళ అతనితోపాటు పెండ్లివిందు జరిగే శాలలోనికి వెళ్ళారు. తెలివిలేని కన్నెలు ఆ యపరాత్రిలో నూనెకోసమని అంగడికి పరుగెత్తారు. కాని వాళ్ళ తిరిగి వచ్చేటప్పటికల్లా పెండ్లివిందు జరిగేశాలను మూసివేయనే మూసివేసారు. - మత్త 25, 1-13.

8. ఓ అతని రాతిపునాదిమీద ఇల్లు కట్టాడు. వాన కురిసింది. వరదలు వచ్చాయి. వరదలు ఆ యింటిచుటూ పారినా దాని పునాది కదలలేదు. మరో అతను ఇసుకపనాది మీదనే యిల్ల కట్టాడు. వాన కురిసింది వరదలు వచ్చాయి. వరదలు ఆ యింటిచుటూ పారగా దాని పునాది కాస్త కొట్టుకొని పోయింది. క్రీస్తు బోధలు ఆలించి ఆ బోధల ప్రకారం జీవించేవాడు తొలివానిలాంటివాడు. కాని క్రీస్తు బోధలు ఆలించి వాటి ప్రకారం జీవించనివాడు రెండవవాని లాంటివాడు- మత్త 7, 24-27.

9. నీకు వెంటనే యిచ్చే శక్తివుంటే యిచ్చేయి. మల్లా రేపురా, అప్పడిస్తానులే అనవద్దు - సామె 8, 28.

11. పగ

అల్పమానవులు ద్వేషానికి లొంగిపోతూంటారు. పగ వలన తోడి నరులకు కీడు చేయబోతారు. కాని దీనివలన మన అల్పత్వమే బయటపడుతుంది.

1. పూర్వ ఉదాహరణల్లో కయీను హెబెలమీదా, యోసేపు సోదరులు యోసేపుమీదా, ఏసావ యాకోబుమీదా, అబ్వాలోము ఆమ్మోనుమీదా,సౌలు దావీదుమీదా, హామాను మొర్టెకయిమీదా, హెరోదియా స్నాపక యోహాను మీదా పగబూనారని చెప్పాం. షిమీ దావీదుమీద పగబూనాడు. దావీదు అబ్వాలోమునకు వెరచి పారిపోతుండగా ఇతడు మార్గంలో దావీదును కలిసికొని అతన్ని శపించాడు. అతనిమీద దుమ్మెత్తిపోసాడు రాళ్ళ రువ్వాడు. ఐనా దావీదు సహించి ఊరుకొన్నాడు. తరువాత దావీదు చనిపోతూ తన కుమారుడు సోలోమోనును ఇతనిమీద పగతీర్చుకొమ్మని చెప్పాడు - 2సమూ 16, 5-10.

2. ఫిలిస్టీయులు సంసోనును బంధించి అతని కండ్లు తీయించారు. అతన్ని నానాహింసలూ పెట్టారు. ఓమారు తమ దేవుడైన డాగోను దేవాలయంలో ఉత్సవం చేసికొంటూ సంసోనును రప్పించి అతన్ని ఎగతాళి చేసారు. ఆ యవమానాన్ని భరించలేక సంసోను దేవాలయాన్ని మోస్తున్న రెండు స్తంభాలనూ రెండుచేతులతో బలంగా నెట్టాడు. 208