పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవు బయటపడినప్పడు నన్ను గుర్తుపెట్టుకో" అని చెప్పాడు. వంటవాడికి తన తలమీద ఉన్న మూడు గంపల్లోని పిండివంటలు పక్షులు తినిపోతున్నట్లుగా కలవచ్చింది. యోసేపు అతనితో "మూడు రోజుల్లో ఫరోరాజు నిన్ను ఉరితీయిస్తాడని ఈ కలభావం” అని చెప్పాడు. అతడు చెప్పినట్లే ప్రభువు పానీయవాహకుని వెలుపలకి తీయించి వంటవాణ్ణి ఉరిదీయించాడు. కాని పానీయవాహకుడు యోసేపువలన మేలు పొందినా చెరనుండి బయటికి రాగానే అతన్ని పూర్తిగా మరచిపోయాడు - ఆది 40.

2. న్యాయనిర్ణయాన్ని గూర్చి క్రీస్తు చెప్పిన సామెత ఒకటుంది. తోడి జనాన్ని ఆదరిస్తే దేవుణ్ణి ఆదరించినట్ల. తోడి జనాన్ని చిన్నచూపు జూస్తే దేవుణ్ణి చిన్నచూపు జూచినట్ల. కొందరు తోడి జనాన్ని అన్నంబెట్టక, దాహమీయక బట్టలీయక, ఉపచారంచేయక ఆ శ్రద్దచేసారు. ప్రభువు తన విషయంలోనే ఈలాంటి అశ్రద్ధ చూపినట్లుగా భావంచి, వాళ్ళకు నిత్య శిక్ష విధించాడు - మత్త 15, 45.

3. ఓ బాటసారి యెరూషలేమునుండి యెరికోకు వెళూన్నాడు. దారిలో దొంగలు అతన్ని దోచుకొని గాయపరచి త్రోవ ప్రక్కన పడవేసిపోయారు. ఓ యాజకుడూ లేవీయుడూ ఆ త్రోవవెంట వసూ గాయపడివున్న బాటసారిని చూచారు. చూచికూడ ఏమీ పట్టించుకోకుండ ప్రక్కకు తొలగి వెళ్ళి పోయారు - లూకా 10, 30-32.

4. క్రీస్తుని అనుసరింపగోరినవాళ్ళల్లో ఓ అతనికి చంచలబుద్ధి పట్టింది. అతడు నేను వెళ్ళి మానాన్న చనిపోయిందాకా వుండి అతన్ని పాతిపెట్టి మళ్లావస్తానన్నాడు. కాని ప్రభువు అతనితో "చనిపోయిన వాళ్ళసంగతి చనిపోయినవాళ్ళు చూచుకొంటారు. నీవువచ్చి నన్ను వెంబడించు" అన్నాడు మత్త 8,22.

5. ఓ యజమానుడు ముగ్గురు సేవకులకు డబ్బు ఇచ్చి దేశాంతరం పోయాడు. అతడు తిరిగి వచ్చేప్పటికల్లా తొలియిద్దరు సేవకులూ తాము తీసికొన్న డబ్బు వృద్ధి చేసారు. కాని మూడవ సేవకుడు తాను పుచ్చుకొన్న డబ్బు వృద్ధిచేయలేదు. యజమానుడు అతని అజాగ్రత్తకు మండిపడి నీవు పనికిమాలిన చెడ్డదాసుడవని చీవాట్ల పెట్టాడు. అతనికిచ్చిన డబ్బు కాస్త తీసికొన్నాడు — మత్త 25, 25-26.

6. ఒకరాజు తన కుమారుని పెండ్లి విందునకు ఆతిథులను ఆహ్వానించాడు. వాళ్ళల్లో ఒక్కడుమాత్రం విందు దుస్తులు తొడుగుకోకుండానేవచ్చి విందారగిస్తున్నాడు. రాజు అతిథులను చూడవచ్చి అతన్ని గుర్తుపట్టి కోపంతో బయటి గెంటించాడు. కనుక మన మెప్పుడూ ప్రభురాజ్యానికి సంసిద్దులమై యుండాలి - మత్త 22, 11-18.

7. ఓ పెండ్లిలో పదిమంది కన్నెలు పెండ్లికుమారునికి స్వాగతమీయడానికై వేచివున్నారు. వాళ్లల్లో ఐదుగురు తెలివైనవాళ్ళు ఐదుగురు తెలివిలేనివాళ్ళు తెలివైన