పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డాగోను దేవాలయం కూలిపడి ఫీలిస్టీయులంతా చచ్చారు. వాళ్ళతోపాటు సంసోనుకూడ చనిపోయాడు. ఆ విధంగా అతడు బ్రతికివున్నప్పటి కంటె చనిపోయినపడే ఎక్కువమంది ఫిలిస్టీయులను చంపి వాళ్ళమీద పగతీర్చుకొన్నాడు - న్యాయాధి 16,28-30.

3. క్రీస్తు బోధలూ అద్భుతాలూ చూడగా యూదనాయకులకు కన్ను కుట్టింది. వాళ్ళు అతన్నిద్వేషించారు. ఏలాగైనా అతన్ని చంపించాలని కుట్రలు పన్నారు - యోహా 15, 22-25.

4

1) మీ పొరుగువాళ్ళను ప్రేమించి మీ శత్రువులను ద్వేషించమని
పూర్వవేదం బోధిస్తుంది. కాని నేను చెప్పడమేమిటంటే, మీ
శత్రువులనుగూడ ప్రేమించండి. అప్పుడు మీరు పరలోకంలోని
తండ్రికి కుమారులౌతారు — మత్త 5, 43.

2) ఎవడైన ఓ వైపున నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పకొంటూ
మరోవైపున తోడినరుణ్ణి ద్వేషిస్తూన్నట్లయితే వాడు అబద్దాలకోరు
ఔతాడు. కంటికి కనుపించే తోడినరుణ్ణి ప్రేమించలేనివాడు కంటికి
కనుపించని దేవుణ్ణి ఏలా ప్రేమిస్తాడు? - 1 యోహా 4,20.

3) నేను వెలుగులో ఉన్నానని చెప్పకొంటూ తోడి నరులను ద్వేషించేవాడు
ఇంకా చీకటిలోనే ఉన్నాడని చెప్పాలి - 1 యోహా 2,9.

12. అవిధేయత

పొగరువల్ల పెద్దలమాట జవదాటుతూంటాం. ఆలాగే దేవునిపట్లగూడ అవిధేయత చూపుతూంటాం. ఈ యవిధేయతకు దేవుడు నరుడ్డి శిక్షిస్తూంటాడు.

1. ప్రభువు తోటనడుమనున్న చెట్టుపండు తాకవద్దని ఆది దంపతులకు ఖండితంగా ఆజ్ఞ యిచ్చాడు. ఆలా తాకితే వాళ్ళకు చావు మూడుతుందనికూడ చెప్పాడు. అయినా వాళ్లు పిశాచంమాట నమ్మి ప్రభువు ఆజ్ఞమీరారు, చావు తెచ్చిపెట్టుకొన్నారు - ఆది 3, 2-3.

2. అబీహు నాదాబు అహరోను కుమారులు. వీళ్ళ ప్రభువు ఆజ్ఞాపింపకున్నా ధూపకలశాలు తీసికొని యావే యెదుట సాంబ్రాణిపాగ వేసారు. ప్రభువు వాళ్ళను నిప్ప మంటలతో కాల్చివేసాడు - లేవీ 10, 1-2

3. ప్రభువు తన్ను దప్ప అన్యదైవతాలను ఆరాధించగూడదని యిస్రాయేలు ప్రజకు ఆజ్ఞయిచ్చాడు. వాళ్ళ చుట్టుపట్లవున్న కనానీయులు ఎద్దును ఆరాధించడం చూచారు. మనమూ ఆ యెదును ఆరాధిస్తే ఎంతో బాగుంటుందని ఉవ్విళ్ళూరిపోయారు.