పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యెముకల్లో ఎముక, మాంసంలో మాంసం అనుకొని మురిసిపోయాడు-2.23. అనగా ఆమె తనకు దగ్గరి బంధువురాలు, ఆప్తురాలు అని భావం. ఆదామేవలు పరస్పరాకర్షణతో, అనురాగంతో ఏకవ్యక్తిగా ఐక్యమైపోయారు. భగవంతుడే భార్యాభర్తలమధ్య ఈ ఆకర్షణను నెలకొల్పి వారిలో పరస్పర ప్రేమను వృద్ధిచేస్తాడు. ఈ యనురాగమే లేకపోతే ఆలుమగలు దీర్ఘకాలం సంసారజీవితం గడపలేరు.

4. పరమగీతం వర్ణించే ప్రేమ

బైబుల్లో పరమగీతం చాల విలక్షణమైన గ్రంథం. ఈ పుస్తకం నిర్మలమైన దాంపత్యప్రేమను వర్ణిస్తుంది. "ప్రేమ మృత్యువువలె బలమైనది. ప్రేమజ్వాలలు అగ్నిజ్వాలల వంటివి. జలములు ప్రేమను ఆర్పలేవు. ప్రవాహములు వలపును మంచివేయలేవు. ఎవడును తన పూర్తి సాత్తుతోగూడ ప్రేమను కొనజాలడు" - 8,6–7. దంపతులు ఈ గ్రంథాన్ని చదివి ప్రేరణను పొందాలి. తమ ప్రేమను బలపర్చుకోవాలి. ఈ పుస్తకం ప్రచారంలోకి వచ్చాక పూర్వవేద రబ్బయిలూ నూత్నవేద రబ్బయిలూకూడ దీనిలోని ప్రేమ భగవంతునికి నరులపట్ల వుండే ప్రేమకు పోలికగా వుంటుందని చెప్పారు. కాని ఈ గ్రంథరచయిత ఉద్దేశించిన మొదటి అర్థం దాంపత్య ప్రేమ మాత్రమే.

5. మంచి తోడు

పెండ్లి చేసికోబోయే యువతీయువకులు తమకు మంచి తోడు లభించాలని దేవుని ప్రార్థించాలి. వివాహితుల భవిష్యత్తు చాలవరకు వాళ్ళు పెండ్లియాడే వ్యక్తులపై ఆధారపడి వుంటుంది.

4.వివాహ విధిలో ముఖ్యాంశం

వధూవరుల అంగీకారమే.

వధూవరుల అంగీకారంద్వారా క్రెస్తవ వివాహం దేవద్రవ్యానుమానమౌతుంది. కనుక అంగీకారం అతిముఖ్యమైంది. దాన్నిగూర్చి మనకు క్షుణ్ణంగా తెలిసివుండాలి. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. అంగీకారమే ముఖ్యమైంది

వధూవరులను భార్యాభర్తలనుగా చేసేది వారి యంగీకారం, జ్ఞానస్నానం పొందిన వధూవరులు గుళ్ళో పీఠంముందు హాజరై గురువు మరియు సాక్షులముందు తాము