పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దయచేస్తాడు. జ్ఞానవివాహంకూడా ఈలా మనకు ఉత్ధానక్రీస్తు వరప్రసాదాన్ని దయచేసేదే కనుక అది కూడ ఓ దేవ ద్రవ్యానుమానమే.

పరిణయమాడే వధూవరులు క్రీస్తుని తిరుసభనూ పోలివుంటారని చెప్పాడు పౌలు. ఈ పోలిక వరప్రసాదాన్ని సంపాదించి పెడుతుంది. కనుక జ్ఞానవివాహంగూడ ఓ సంస్కారమే.

సంగ్రహంగా చెప్పాలంటే, క్రీస్తు జ్ఞానవివాహాన్ని నూతనంగా స్థాపించలేదు. అది లోకారంభంనుండి మానవజాతిలో వున్నదే. ప్రభువు దాన్ని చేకొని పవిత్రపరచి జ్ఞానవివాహమనే నూతన సంస్కారాన్ని ఏర్పాటు చేసాడు.

ప్రార్ధనా భావాలు

1. దేవునికి లింగం లేదు

పూర్వవేదాన్ని వ్రాసిన కాలంలో యిప్రాయేలీయులకు సమకాలికులైన అన్యజాతి ప్రజలు బాలు దేవతను కొల్చేవాళ్ళు.ఈ దేవతకు అనత్ అనే భార్య వుండేది.ఆనాటి అన్యజాతి ప్రజలు ఈ భార్యాభర్తలు తమకు సంతానాన్ని ప్రసాదిస్తారని నమ్మి వారిని కొల్చేవాళ్ళు. దీనికి భిన్నంగా బైబులు వ్రాసిన భక్తులు యావే ప్రభువుకి భార్యలేదని చెప్పారు. శరీరధారి కాడు కనుక అతనికి లింగం కూడ లేదు. ఈ పవిత్ర ప్రభువు యిస్రాయేలీయులతో నిబంధనం చేసికొని వారిని దీవించాడు. తనకూ ఆ ప్రజలకూ మధ్య భార్యాభర్తల సంబంధం నెలకొనేలా చేసాడు. ఈ సంబంధమే తర్వాత క్రీస్తు తిరుసభలమీద సోకింది. నేడు మన వివాహం పవిత్రం కావడానికికూడ కారణమైంది.

2.తొలి వివాహం

భగవంతుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సాటియైన తోడును తయారుచేస్తాను అనుకొన్నాడు. ఆదాము ప్రక్కటెముకనుండి ఏవను రూపొందించి ఆమెను అతనికి తోడుగా ఇచ్చాడు-ఆది 2,18. ఆ జంటను దీవించి మీరు చాలమంది బిడ్డలను కని వృద్ధిచెందండని చెప్పాడు – 1,28. ఆదాము ఏవను ఆదరంతో అంగీకరించాడు. ఇదే బైబుల్లోని తొలి వివాహం. అది నేటి మన వివాహాలన్నిటికి ఆదర్శంగా ఉంటూంది.

3. పరస్పరాకర్షణం

దేవుడు ఏవను ఆదాము ప్రక్కటెముక నుండి చేసాడు - ఆది 2,22. అనగా ఆమె అతని కోవకు చెందింది. అతనిలాంటిది. తర్వాత ఆదాము ఏవనుజూచి ఈమె నా