పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ రహస్యాన్ని తెలియజేసిన సంసోను తన చావు తానే తెచ్చి పెట్టుకొన్నట్లయింది - న్యాయా 16, 5.

4. గురుద్రోహియైన యూదా ప్రధానాచార్యుల దగ్గర ముప్పై వెండినాణాలు లంచం తీసికొని క్రీస్తును వాళ్ళకు పట్టీయడానికి ఒప్పకొన్నాడు - మత్త 26, 14-15.

5.ప్రధాన యాజకులు సైనికులను క్రీస్తుసమాధికి కాపుంచారు. ఈ సైనికులు క్రీస్తు ఉత్థానం కావడంచూచి భయపడిపోయి ప్రధాన యాజకులకు తెలియజేసారు. వాళ్ళు తమలో తాము కూడబలుకుకొని సైనికులకు లంచాలిచ్చి "మీరు మేము నిద్రబోతూండగా క్రీస్తు శిష్యులు వచ్చి అతని శవాన్నెత్తుకొని పోయారని పుకార్లపట్టించండి. మేము రోమను అధిపతులవలన మీకేలాంటి బాధా కలుగకుండా చూస్తాం" అని చెప్పారు. సైనికులు ఆ డబ్బులు తీసికొని యాజకులు చెప్పినట్లే పుకార్లు పుట్టించారు. కాని సత్యంమాత్రం యూదప్రజలకు తెలిసిపోయింది - మత్త 28, 12-15.

6. యూదుల నాయకులు పౌలును బంధించి కైసరయలోని ఫీలిక్సు అనే అధిపతివద్దకు తీసుకొని వచ్చారు. ఫీలిక్సు పౌలు సమాధానం విన్నాడు. పౌలు లంచం పెడితే అతన్ని విడిపించాలని ఫీలిక్సు ఉద్దేశం. కాని రెండేడ్లుగడిచినా పౌలు లంచమీయలేదు, ఫీలిక్సు అతన్ని విడిపించనూలేదు. తర్వాత ఫీలిక్సు మారిపోయి మరో అధికారి వచ్చాడు. పౌలు మాత్రం చెరలోనే వుండిపోయాడు - అకా 24, 26-27.

6.ధనమూ-ధనవాంఛా

నరులు ఆశతో డబ్బు కూడబెట్టగోరుతూంటారు. చివరికి దానికి దాసులైపోతూంటారు. కొందరు సొంత ప్రాణానికంటే దేవునికంటే గూడ అధికంగా డబ్బును గౌరవిస్తారు. అది చివరికి నరుల ప్రాణాలనే తీస్తుంది.

1. యోసేపు సోదరుల అతన్ని చంపివేయాలనుకొని ఓ గోతిలో పడద్రోసారు. మళ్ళా అతన్ని చంపివేయడమెందుకులెమ్మని పైకిలాగి యిరవై వెండినాణాలకు యిష్మాయేలీయులకు ఆమ్మివేసారు. ఈ విధంగా వాళ్ళు తమ్మునికంటె డబ్బుకే ఎక్కువ విలువనిచ్చారు ఆది - 37, 26-28.

2. యాకోబు తన మేనమామయైన లాబాను ఇంటిలో జీతానికున్నాడు. ఈ లాబాను వట్టి మోసగాడు. యాకోబుకు తక్కువజీతమిచ్చి ఎక్కువపని రాబట్టుకోవాలి అనుకొనేవాడు. అతడు యాకోబు జీతం మాటిమాటికి మారుస్తుండేవాడు. అలా పదిసార్లు మార్చాడు - ఆది 31, 7.