పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. క్రీస్తు ఉత్థానం అనంతరం యెరూషలేములో క్రైస్తవ సమాజం బలపడింది. ఆ సమాజానికి ఏడుగురు పరిచారకులుండేవాళ్లు, వాళ్ళల్లో స్తెపనుకూడ ఒకడు. ఇతడు పూర్వవేదంవలన ఇక ఫలితం లేదని బోధించాడు. మోషేధర్మశాస్త్రమూ యెరూషలేము దేవాలయమూ ఇక మనల రక్షించలేవనీ, మనలను రక్షించేది ఉత్దాన క్రీస్తు ఒక్కడేనని వాదించాడు. యూద నాయకులు ఆ బోధను సహించలేకపోయారు, యూదమతానికి తలవంపులు కలిగాయనుకొన్నారు. వాళ్ళు కోపంతో స్తెఫనుని ఊరిబయటికికి లాగుకోని వెళ్ళి రాళ్ళతోకొట్టి చంపారు. స్తెఫను ఉత్దాన క్రీస్తుని దర్శించి ప్రాణాలు విడిచాడు. అతనిచావు తలపెట్టిన వాళ్ళలో సౌలు కూడ ఒకడు - ఆచ 7, 54–60.

9. సౌలు డమస్కు పట్టణంలోని క్రైస్తవులను హింసించడానికి వెళ్తుండగా దారిలో క్రీస్తు ప్రత్యక్షమై అతని మనసు మార్చాడు. అప్పటినుండి సౌలు క్రీస్తే మెస్సియా అని డమస్కుపట్టణంలో ఆవేశంతో ఉపన్యసించడం మొదలెట్టాడు. ఆ పట్టణంలోని యూదులు, అతన్ని చంపాలని కుట్రలు పన్నారు. ఆ సంగతి గుర్తించి సౌలు మిత్రులు అతన్ని ఓ గంపలో కూర్చుండ బెట్టి రాత్రివేళ పట్టణపు గోడమీదిగా వెలుపలికి దింపారు. ఆ రీతిగా సౌలు శత్రువులనుండి తప్పించుకొన్నాడు – అచ 9, 23–25.

5. లంచాలు

నరులు లోభంవలన లంచానికి లొంగిపోతారు. డబ్బు తీసికొని కానిపనులు చేస్తారు. డబ్బుకు అమ్ముడుపోయేవాళ్ళు వట్టి నీచులు.

1. సమూవేలు ప్రవక్త మొదటి న్యాయాధిపతి. అతడు చక్కగా తీర్పులుతీర్చి ప్రజలకు న్యాయం జరిగించాడు. సమూవేలు తరువాత అతని కుమారులు న్యాయాధిపతులయ్యారు. కాని వాళ్ళకు తండ్రి గుణాలు అబ్బలేదు. వాళ్ళ కాసులకు దాసులై లంచాలు తీసికొని న్యాయం చెరిచారు-1 సమూ 8, 3-5.

2. ఆహాసు యిస్రాయేలు నేలిన దుష్టరాజుల్లో ఒకడు. ఇతనికాలాన అస్పిరియను రాజగు టిగ్లాతిప్పలేసరు పాలస్తీనా మీదికి దండెత్తి వచ్చాడు. ఆహాసు దేవాలయంసొమూ అపహరించి ఈ రాజుకు లంచం పెట్టాడు. కాని టిగ్లాతిప్పలేసరు ఆ లంచం పుచ్చుకొని గూడ ఆహాసును శిక్షించి వెళ్లాడు - 2 దిన 28, 20-21.

3. ఫిలిస్టీయుల ఆడపడుచు డెలేలాను సంసోను పెండ్లి చేసికొన్నాడు. కాని వాళ్ళకు సంసోనంటే గిట్టదు. కనుక ఫిలిస్టియదొరలు డెలీలాకు లంచం పెట్టారు. వారిలో ఒక్కొక్కడు ఆమెకు పదకొండువందల వెండి నాణాలు చెల్లించాడు. డేలీలా సంసోసు బలం అతని తలవెండ్రుకల్లో ఉంటుందని తెలిసికొని ఫీలిస్ట్రీయ సర్దారులకు ఎరిగించింది.