పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఓ మారు సొలోమోను ప్రభువును ఆరాధించడానికి గిబ్యోను పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కన్పించి ఏమివరం కావాలో కోరుకొమ్మన్నాడు. సొలోమోను స్వార్దానికేమీ కోరుకొలేదు. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించడానికి వివేకంమాత్రం ప్రసాదించమని అడిగాడు. ఈ కోరిక ప్రభువుకి చాల నచ్చింది. దేవుడతనితో నీవు దీర్షాయువుగాని సిరిసంపదలుగాని శత్రువినాశంగాని కోరుకోక ప్రజలకు మేలుచేయడానికై వివేకాన్ని కోరుకొన్నావు. ఈ వరాన్ని ఇస్తున్నాను. పైపెచ్చు నీ వడగకపోయినా దీర్ఘాయువూ సిరిసంపదలుకూడ ఇస్తున్నాను ఆన్నాడు. స్వార్థంలేని నరనికి లభించే బహుమతి అది —1రాజు 3, 11-14.

4. యూదా ప్రభుని ముప్పది వెండినాణాలకు అమ్మాడు కదా! తరువాత అతనికి పశ్చాత్తాపం పట్టింది. అతడు మళ్లా ప్రధానయాజకుల వద్దకు వెళ్ళి మీ సొమ్ము మీరు తీసికొని క్రీస్తుని విడిపించండి అని అడిగాడు. వాళ్లు ఆ సంగతి మాకేమీపట్టదు అన్నారు. యూదా కోపంతో ఆ వెండినాణాలను అక్కడే దేవాలయంలోనే విసరికొట్టాడు. నిరుత్సాహంతో వెళ్ళిపోయి వురివేసుకుని చచ్చాడు. ధనలోభంవల్ల యూదాకు ప్రాణనష్టం కలిగింది — మత్త 27, 3–5.

5. ఓ మారు ఓ ధనిక యువకుడు క్రీస్తువద్దకువచ్చి నేనూ నిన్ను వెంబడిస్తానన్నాడు. క్రీస్తు మొదట నీ యాస్తిపాస్తులను అమ్మి పేదలకిచ్చి అటుపిమ్మటవచ్చి నా శిష్యుడవు కమ్మని చెప్పాడు. అతడు చాల ధనవంతుడు. ఒకవైపు తన సిరిసంపదలను వదలుకోలేకా, మరోవైపు క్రీస్తుశిష్యుడు కాలేకా ఆ యువకుడు విచారంతో వెళ్ళిపోయాడు. ఓకోమారు మన డబ్బే మనలను భగవంతునినుండి వైదొలగిస్తుంది - మార్కు 10, 21-22.

6. ఓ యజమానుడు దేశాంతరంవెళ్తు తన సేవకుల్లో ఒకనికి ఐదుసంచులూ, ఇంకో అతనికి రెండుసంచులూ, మరొకనికి ఒకసంచీ ధనమిచ్చి పోయాడు. అతడు మళ్లాతిరిగి వచ్చి సేవకులను లెక్క అడిగాడు. ఐదుసంచులు తీసుకొన్నవాడు ఇంక ఐదుసంచులూ, రెండుసంచులు తీసుకొన్నవాడు ఇంకో రెండు సంచులూ కూడబెట్టి వుంచారు. కాని ఒక సంచిధనం తీసికొన్నవాడు మాత్రం ఏమి వృద్ధిచేయకుండ మెదలకుండా వుండిపోయాడు. యజమానుడు వాడిమీద మండిపడ్డాడు. వాని సొమ్ముకూడ తిసుకుని మొదటివాని కిచ్చివేసాడు. కనుక భగవంతుడు మనకిచ్చిన శక్తిసామర్థ్యాలను వృద్ధిచేసికోవాలి - మత్త 25, 14, 30.

7. ఒక ధనవంతునికి పుష్కలంగా పంటలు పండాయి. అతడు తన కొట్లుపడగొట్టించి ఇంకా పెద్దకొట్ల కట్టించి ధాన్యం నిల్వజేయిస్తాననుకొన్నాడు. నేను చాల