పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. తిరుసభలో నూత్న దృక్పథాలు

తొలి రోజుల్లోని తిరుసభ ఒక పద్ధతిలో వుండేది. కాలక్రమేణ దానిలో చాల మార్పులు వచ్చాయి. చారిత్రక, సాంఘిక కారణాలు ఈ మార్పులకు కారణం. కాని ఈ మార్పుల్లో కొన్ని తిరుసభను అపమార్గం పట్టించాయి. అది లోకానికి నిజంగా ఉపయోగపడాలంటే ఈ యనిష్ట ధోరణులను సవరించుకొని ఆదిమ క్రైస్తవ సమాజం పద్ధతికి రావాలి.

1. ఆదిమ తిరుసభ సువిశేష బోధకు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చింది. అది ఆనాటి ప్రజలకు క్రీస్తు బోధలనూ మార్గాన్నీ వివరించింది. చాలమంది క్రీస్తు వలన ఆకర్షితులై అతన్ని అనుసరించారు. కాని మధ్యయుగాల్లో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడము ముఖ్యాంశమైంది. క్రైస్తవుల సంఖ్యలు పెరిగాయి. కాని భక్తివిశ్వాసాలు లేనివాళ్ళు కూడ స్వార్ధప్రయోజనాల కొరకు క్రైస్తవ మతంలో చేరారు. మంది యొక్కువయితే మజ్జగ పల్చనయింది. రెండవ వాటికన్ సమావేశం క్రీస్తుని బోధించడం తిరుసభ ప్రధాన పూచీ అని నొక్కిచెప్పింది. నేడు మనం శుద్ధమైన క్రైస్తవులంగా జీవించి క్రీస్తుని ప్రకటించాలి. మతవ్యాప్తి మన ప్రధానాశయం కాదు.


2. తొలినాటి క్రైస్తవులు పరస్పర సంబంధంగల భక్తసమాజంగా జీవించారు. ఆ సమాజంలో సోదరప్రేమ బలంగా వుండేది. ఆ ప్రేమకు ముగ్గులై ఆనాడు చాలమంది ఆ సమాజంలో చేరారు. కాలక్రమేణ తిరుసభ తానొక ప్రేమ సమాజానున్న సంగతిని మరచిపోయి ఓ సంస్థగా మారిపోయింది. సోదరప్రేమకు బదులుగా వ్యక్తిగతమైన ప్రాతినిధ్యం ముఖ్యమనుకొన్నారు. వాటికన్ సమావేశం మళ్ళీ ఈ సోదర ప్రేమను పునరుద్ధరింప గోరింది. ఇప్పడు తిరుసభ లోకమంతటితోను సఖ్యసంబంధాలు పెంచుకోవాలి. అందరిపట్ల ప్రేమతో మెలగాలి.


3. తొలినాటి క్రైస్తవులు క్రీస్తుని గాఢంగా అనుభవానికి తెచ్చుకొన్నవాళ్ళ ఆ యనుభూతినే వాళ్ళు ఆనాటి ప్రజలకు కూడ అందించారు. కనుకనే యోహాను "మేము కన్నులారచూచి, చెవులారవిని, చేతులార తాకిన జీవవాక్కును మీకు తెలియజేస్తున్నాం" అన్నాడు 1యో 1,1. మధ్యయుగాల్లో ఈ దైవానుభూతి నశించింది. తిరుసభ కొన్ని మతసత్యాలను ప్రోగుజేసికొంది. వాటిని జ్ఞానోపదేశ గ్రంథాలుగా, దైవశాస్త్ర సంగ్రహాలుగా తయారుచేసి ప్రజలకు బోధించసాగింది. వాటికన్ సమావేశం, క్రైస్తవులు క్రీస్తుని గూర్చిన తమ వ్యక్తిగత అనుభవాన్ని లోకానికి తెలియజేయాలని సూచించింది. కనుక నేడు మనం