పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ అన్యులు అనే భేదభావం వుండకూడదు. దారిద్ర్యం అందరినీ బాధిస్తుంది. కనుక నరులందరినీ ఆదుకోవడం మన ధర్మం.

తిరుసభలో మార్పు రావాలి. ఈ మార్పు అన్నివర్గాల ప్రజల్లోను కన్పించాలి. మన పీఠాధిపతులూ, గురువులూ మఠసభల సభ్యులు మారాలి. గృహస్తులు మారాలి. మన విచారణల్లో విద్యా సంస్థల్లో, ఆస్పత్రుల్లో సాంఘిక సేవాసంస్థల్లో పెద్దమార్పు రావాలి. మన జీవితంలో ఆలోచనల్లో క్రియల్లో మార్పు రావాలి. దేవుని ఆత్మ ప్రాతపద్ధతులను తొలగించి కాలానుగుణమైన క్రొత్త పద్ధతులను తీసికొని వస్తుంది. ఈ క్రొత్తను మనం అంగీకరించాలి.

మన దినచర్య ఎలా వుండాలి? అందరూ రోజూ కాసేపు వేదవాక్యాన్నిచదువుకొని ప్రార్ధనం చేసికోవాలి. వాక్యం మనకు దైవచిత్తాన్నీ దేవుని కోర్కెలనూ తెలియజేస్తుంది. మన జీవితాన్నిదేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవాలి. ప్రార్ధనంవల్ల దైవరాజ్యాన్ని పొందుతాం. మనలోని స్వార్గాన్ని అణచుకొని దేవునికి ప్రీతి కలిగించే పనులు చేయడానికి పూనుకొంటూం.

పశ్చాత్తాపం, పరివర్తనం మనకు ఎప్పడు అవసరమే. మనం దేవునివైపు పయనించాలి. కాని లోకవస్తువుల వైపు వెళూంటాం. పరివర్తనం ద్వారా మన గమ్యాన్ని మార్చుకొని దేవుని చెంతకు చేరతాం. మన పొరపాట్లను చక్కదిద్దుకొని సత్యమార్గంలో నడుస్తాం.

ఉత్తములైనవారికి ఆత్మపరిశీలనం కూడా వుండాలి. హృదయానికున్న కపటం మరి దేనికీలేదు. అది మంచిని చేసే నెపంతో చెడ్డను చేస్తుంది. కనుక మన పనులు నిజంగా దేవునికి ప్రీతి కలిగిస్తున్నాయా, తోడివారికి మేలు చేస్తున్నాయా అని పరిశీలించి చూచుకోవాలి. ఈ యాత్మ పరిశీలనతో ఎప్పటికప్పుడు మనలను మనం సంస్కరించు కోవాలి.

భారతదేశ తిరుసభ "నా చిన్ని బొజ్ఞకు శ్రీరామరక్ష" అన్నట్లుగా ప్రవర్తించగూడదు. మైనారిటీ వర్గానిమైన మనం ఎప్పడూ మన హక్కులను మనం కాపాడుకొనే ప్రయత్నంలోనే వుండకూడదు. మన చుటూ వున్న అన్య మతస్తులనుగూడ పట్టించుకొంటూండాలి. წლపర్యాయాలు అల్ప సంఖ్యాకులమైన మనకున్న సదుపాయాలు అధిక సంఖ్యాకులైన అన్యమతాలవారికి లేవు. విద్యావైద్య సాంఘిక సంక్షేమ రంగాల్లో మనకే ఎక్కువ సౌకర్యాలు వున్నాయి. ఈ దేశంలో మనకంటె నిరుపేదలూ నికృష్ణ దశలో వున్నవాళ్ళు చాలమంది వున్నారు. వీరికి సహాయం చేయడం మన బాధ్యత.