పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రజలకు తెలియచేయవలసింది పుస్తకాల్లోని మత సిద్దాంతాలనుగాదు, మన దైవానుభూతుల్ని ప్రభువుపట్ల వ్యక్తిగతమైన భక్తి లేనివాళ్ళు అతన్ని ఎలా బోధించ గలుగుతారు?

4. తొలిరోజుల్లో తిరుసభ స్థానిక తిరుసభ ఎక్కడి క్రైస్తవులు అక్కడే ప్రోగయ్యేవాళ్ళ ఒకరినొకరు పరామర్శించేవాళ్ళు అంగీకరించేవాళ్ళ ఎక్కడి సమస్యలు అక్కడే చర్చించుకొనేవాళ్ళు పరిష్కరించుకోగలిగిన వాటిని పరిష్కరించుకొనేవాళ్ళు ఆరోజుల్లో అన్నీ స్థానిక తిరుసభలు, కాని మధ్యయుగాల్లో క్రైస్తవ సమాజం ఏక తిరుసభ, విశ్వశ్రీసభ అయింది. కేంద్రం నుండి నియమాలు జారీచేయడం మొదలుపెట్టారు. అధికారాలు, పరిపాలనలు, నియమావళి పెచ్చుపెరిగాయి. ఫలితంగా స్థానిక తిరుసభలు చచ్చిపోయాయి. ఆత్మ దయచేసే వ్యక్తిగత వరాలు అడుగంటాయి. వాటికన్ సమావేశం మళ్ళా స్థానిక తిరుసభలను ఉద్ధరించింది. స్థానిక క్రైస్తవులు ప్రత్యేక సమాజాలుగా ఏర్పడి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి చూచుకోవాలని చెప్పింది. ఇప్పడు ఏ మేత్రాసనానికి ఆ మేత్రాసనం, ఏ విచారణకు ఆ విచారణ తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలి.

5. ఆదిమ క్రైస్తవులు నేరుగా క్రీస్తుని ప్రకటించారు. ప్రజలు క్రీస్తుని విశ్వసించి అతని అనుచరులయ్యారు. ఈ యనుచర బృందమే దైవరాజ్యం. మధ్యయుగాల్లో క్రీస్తునిగాక క్రైస్తవమత సత్యాలను బోధించారు. ప్రజలు తిరుసభలో చేరడమే ముఖ్యమన్నారు. విశ్వాసముంటేచాలు మోక్షానికి వెళ్తామన్నారు. క్రైస్తవులు లోకానికి దూరమయ్యారు. వాటికన్సభ మళ్ళాదైవరాజ్య స్థాపనం ముఖ్యమని చెప్పింది. లోకంలోని ప్రజల కష్టసుఖాలు, ఆశా నిరాశలు తిరుసభ తనసొంతం చేసికోవాలని చెప్పింది. కనుక ఇప్పడు ప్రపంచంలోని ప్రజల బాగోగులను పట్టించుకోవడం మన ముఖ్యధర్మం కావాలి.

6. ఆదిమ క్రైస్తవుల్లో ఒకరెక్కువ మరొకరు తక్కువ అనే భావంలేదు. విశ్వాసులంతా సరిసమానం అనుకొన్నారు. కాని మధ్యయుగాల్లో యాజకవర్గం ప్రాబల్యం పెరిగింది. బిషప్పలు గురువులు, మఠసభల సభ్యులు ఎక్కువ, గృహస్తులు తక్కువ అనే భావం ప్రచారంలోకి వచ్చింది. యాజకులు వరప్రసాదాలు అందిస్తే గృహస్థలు స్వీకరిస్తారు. వాళ్ళు నాయకులు, సామాన్య ప్రజల నడిపింపబడేవాళ్ళు వీళ్ళచేసే పనేమీలేదు. జడపదార్థాల్లాగ ఊరకుంటారు అనుకొన్నారు. కాని వాటికన్ సభ ఈ భావాన్ని పూర్తిగా మార్చివేసింది.తిరుసభ సభ్యులంతా ఏకసమాజం. వారివిలువ సరిసమానం, వారుచేసే పనుల్లో మాత్రం తేడావుంటుంది అని చెప్పింది. గృహస్తులకు ఆదిమ సమాజంలోవున్న ఘనతను పునరుద్ధరించింది. నేడు తిరుసభ సభ్యులంతా కలసి కృషి చేయాలి.