పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకారం తొలినాటి యెరూషలేము సమాజం ఏకహృదయం కలిగివుండేది. ఆ సమాజంలో పేద ధనిక తారతమ్యాలు వుండేవికావు. ఉన్నవాళ్ళు, తమ సౌతుని లేనివాళ్ళతో, పంచుకొనేవాళ్ళ-2, 45. ఈ లక్షణాలు మౌలిక సంఘాల్లో కనిపించాలి. వీళ్ళ క్రీస్తుని బాగా అనుభవానికి తెచ్చుకొని మొదట విచారణలోని క్రైస్తవులకు ప్రేరణం పట్టించాలి. క్రైస్తవ సమాజం వట్టి సంస్థగాదు భక్తబృందం అనేలాగ వారిలో మార్పుతీసుకురావాలి. క్రైస్తవులందరూ సువిశేష విలువల ప్రకారం జీవించేలా చేయాలి. వారిలో క్రీస్తుపట్ల విశ్వాసం పెంచాలి. అటుపిమ్మట వీళ్ళ తమ చుట్లపట్ల వున్న క్రైస్తవేతరులతో కృషి చేయాలి. వారిలో దైవరాజ్య విలువలు ఇంతకుముందే నెలకొని వుంటాయి. ఇప్పడు ఆ విలువలను ఇంకా పెంచి దైవరాజ్యాన్ని సుస్థిరం చేయాలి. సువిశేష విలువలను ప్రచారం చేయాలి. నరులంతా శాంతి సంతోషాలతో జీవించడానికి దోహదం చేయాలి. క్రీస్తు కోరిన దైవరాజ్యం ఇదే. మౌలిక సంఘసభ్యులు ప్రధానంగా క్రీస్తుకి సాక్ష్యం పలికేవాళ్ళ కాని అన్యులతో కలిగే సంబంధవల్ల మన క్రైస్తవుల భక్తి విశ్వాసాలు సన్నగిల్లిపోకూడదు. విశేషంగా దివ్యసత్రసాద బలిపట్ల, క్రీస్తుపట్ల మన విశ్వాసం తగ్గిపోకూడదు. అన్యులకు మనం తెలియజేసేది ప్రధానంగా క్రీస్తుని, ఆ క్రీస్తుపట్ల విశ్వాసం లోపిస్తే అతన్ని ఇతరులకు ఏలా బోధిస్తాం?

5. నూత్న తిరుసభకు నూత్న పరిచర్యలు

నూత్న తిరుసభ ప్రధానంగా ప్రేషిత సేవకు అంకితం కావాలి. దానికి జరిగే పరిచర్యల్లోకూడ మార్పు రావాలి.

1. వాక్యబోధ ముఖ్యాంశం కావాలి

1. వాక్యబోధవల్లనే తిరుసభ పడుతుంది. కనుక దానిలో వాక్యబోధ ముఖ్యం కావాలి. మన గురువులు వాక్య బోధను ముమ్మరం చేయాలి. ప్రతి దైవకార్యంలోను వాక్యబోధ తప్పక జరగాలి.

2. దైవార్చన కార్యాలన్నీ దైవరాజ్యాన్ని సూచించేవిగా వుండాలి. క్రీస్తు మరణోత్తానాలతో దైవరాజ్యం ఏర్పడింది. ఈ రాజ్యం రాజకీయ ప్రాబల్యం వలనకాక క్రీస్తు ప్రేమవలనా ఆత్మార్పణం వలనా ఏర్పడింది. దైవార్చనలో, విశేషంగా పూజలో, విశ్వాసులు ఈ దైవరాజ్యంలో భాగస్టులౌతారు. మనం ఏదో అప్ప తీర్చుకోవడానికికాక, దైవరాజ్యాన్ని స్థాపించడానికి పూజలో పాల్గొనాలి.

3. మన కర్మకాండ నరులమధ్య సఖ్యసంబంధాలు పెంచాలి. పూర్వవేదంలోని బలులు ప్రజలకు దేవునితో సఖ్యతను పెంచాయి. అలాగే మన నూత్నవేద బలులు మనకు