పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తుతో సఖ్యతను పెంచాలి. ఈ సఖ్యత ద్వారానే క్రైస్తవుల్లో పరస్పర సఖ్యత కూడ పెరగాలి. క్రీస్తు శరీరాన్ని భుజించే మనం ఒక్కరొట్టెగా, ఒక్కసమాజంగా ఐక్యం గావాలి - 1కొ 10,17. తోడి నరులతో ఐక్యం గాకుండా దేవునితో ఐక్యంగాలేం. తుదితీర్పు సామెత బోధించేది యిదే. కాని మనలో ఐక్యతను చెరచేది కులవ్యవస్థ. మన సమాజంలో కులం తెచ్చిపెట్టే అనర్గాలు అన్ని యిన్నీ కావు. మన గురువులూ మఠకన్యలే కులం పేరు మీదిగా మురాలవుతున్నారు. ఇక సామాన్యజనం కుల ప్రాబల్యంవలన మురాలు కట్టకుండా వుంటారా?

ఈ కుల విభజనను మనం పూర్తిగా వ్యతిరేకించాలి.

4. మనకు పరిపాలనా వ్యవస్థ వుంది. కాని మన బిషప్పలూ గురువులూ క్రైస్తవ సమాజాన్ని లౌకిక సమాజాన్నిలాగ పరిపాలించకూడదు. క్రైస్తవ సమాజాలను పోషించి పెంచడం మన పాలకుల ధ్యేయం కావాలి. ప్రేమతో క్రైస్తవ సమాజాలను పరిపాలించడం వలన మన ప్రజల్లో, సఖ్యసంబధాలు పెరుగుతాయి. మన అధికారానికి ఆధారం పవిత్రాత్మ ఈయాత్మ తిరుసభకే ఆత్మ. క్రైస్తవ అధికారులు ఆత్మశక్తితో బూగా తిరుసభను పరిపాలిస్తే మన ప్రజల్లో ప్రేమశకీ, పరస్పర సంబంధాలు పెరుగుతాయి. మన అధికారులు తమ పరిపాలనం ద్వారా తిరుసభను సజీవం, ఉత్సాహపూరితం చేయాలి దాన్ని ఓ మహాభవనాన్ని లాగ నిర్మించాలి.

5. మన ఆధ్యాత్మిక జీవితం పరివర్తనంతో కూడింది కావాలి. పవిత్రాత్మ ద్వారా జీవించేదే ఆధ్యాత్మిక జీవితం. కాని మనలోని స్వార్థం ఈ యాత్మకు అడ్డదగులుతుంది. స్వార్ధం వల్లనే మనం నానా పాపకార్యాలు చేస్తాం. పశ్చాత్తాపం ద్వారా ఈ స్వార్ణాన్ని అణచుకొంటాం. పరివర్తనంలేని పుణ్యకార్యాలు మనలను గర్విషులను చేస్తాయి. కనుక వినయం, పరివర్తనం మనకు ఎల్లప్పడు అవసరమే, ఎప్పటికప్పుడు పరివర్తనం చెందే వాడు ఇతరులపట్ల ప్రేమతో జీవిస్తాడు. క్రైస్తవ సమాజాన్ని పెంపులోకి తెస్తాడు.

2. వేదబోధక తిరుసభ

వాక్యాన్నిస్వీకరించిన క్రైస్తవ సమాజం వాక్యాన్నిబోధించాలి. ఒకసారి వాక్యాన్ని అనుభవానికి తెచ్చుకొన్న విశ్వాసి వాక్యాన్ని ప్రకటించకుండా వుండలేడు. క్రీస్తుకి సాక్షి కాకుండా వుండలేడు. క్రైస్తవ సమాజం ఎప్పడు కూడ వేదబోధ చేసే సమాజం. వేదబోధ దాని ప్రధానమైన పని.

1. నూత్నవేదం పేర్కొనే క్రైస్తవ సమాజం ఎప్పడూ వేదబోధ చేస్తుంటుంది - అచ 8,4. కాని నేడు క్రైస్తవ సమాజానికి చెంది వుండడమంటే ఓ సాంఘిక సంక్షేమ