పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. పీఠాధిపతుల బృందం

ప్రపంచంలోని బిషప్పులంతా కలసి ఒక్క బృందం ఔతారు. ఈ బృందానికి శిరస్సు లేక నాయకుడు పోపుగారు. ఈ పోపుగారు కూడ బిషప్పుల్లో ఒకరే. ఆ విషయం తర్వాత వస్తుంది. తొలిరోజుల్లో పేత్రూ శిష్యులూ కలసి ఒక్క ప్రేషిత సంఘమయ్యారు. అలాగే పేత్రు వారసుడూ రోమాపురి బిషప్పూ ఐన పోపుగారూ, ఇతర బిషప్పలూ కలసి ఒక్క సంఘమౌతారు. ఆ ప్రేషిత సంఘమూ ఈ పీఠాధిపతుల సంఘమూ కూడ క్రీస్తు ఆజ్ఞవల్లనే ఏర్పడ్డాయి.

ఈ బిషప్పుల బృందానికి తిరుసభమిూద సమగ్రమైన అధికారం వుంటుంది. ఈ సంఘానికి శిరస్సు లేక అధిపతి పోపుగారు. సభ్యులు బిషప్పులు. అభిషేకంద్వారానే బిషప్పుకి ఈ సభ్యత్వం వస్తుంది. ఈ బృందమంతా కలసే తొలి అపోస్తలులకు వారసులు. వీళ్ళద్వారానే అపోస్తలుల సంప్రదాయం తిరుసభలో కొనసాగుతుంది. ఈ బిషప్పుల సంఘమంతా కలసి విశ్వవ్యాప్తమైన తిరుసభను పరిపాలిస్తుంది. తిరుసభలో ఈ సంఘానిదే పై యధికారం, అనగా ఈ సంఘానికి మించిన అధికారం మరెవరికీ లేదు.

పీఠాధిపతిని అభిషేకించడానికి ఒక్క బిషప్ప చాలరు, ముగ్గురుకావాలి. ఈ క్రియు బిషప్పు ఎప్పడూ ఏక వ్యక్తిగాగాక, ఒక బృందానికి చెందినవాడగా పరిగణింపబడతాడని సూచిస్తుంది.

బిషప్పుల పరిషత్తు (పాపగారు బిషప్పులు కలసి) ఏకగ్రీవంగా బోధించిన వేదసత్యాలు తిరుగులేని మోతాయి. వాటికి పొరపాటు పడని వరం వుంటుంది. పరిశుద్ధాత్మే ఈ పరిషత్తును నడిపిస్తుంది, ప్రబోధిస్తుంది. కనుక తిరుసభ సభ్యులు ఈ వేద సత్యాలను సంపూర్ణంగా అంగీకరించాలి.

మామూలుగా ఈలాంటి వేదసత్యాలను బిషప్పుల పరిషత్తు ఎక్యుమెనికల్ సభల్లో వెల్లడి చేస్తుంది. ఈ సభలు పోపుగారితోను అందరు బిషప్పులతోను కూడి వుంటాయి. ఐనా అందరు బిషప్పలూ ఈ సభలకు వ్యక్తిగతంగా హాజరు కానక్కరలేదు. వారు తమతమ తావుల్లో వుండే తమ సమ్మతిని వెల్లడి చేయవచ్చు. రెండవ వాటికన్ మహాసభ ఈలాంటి ఎక్యుమెనికల్ కౌన్సిల్

వాటికన్ మహాసభ తర్వాత "బిషప్పుల సమాఖ్య" అనేది కూడ వచ్చింది. దీనిలో అందరు బిషప్పుల తరపున కొందరు బిషప్పులు మాత్రమే పాల్గొంటారు. వీళ్లు పోపుగారి నాయకత్వం క్రింద సమావేశమై తిరుసభలోని ఆయా సమస్యలను గూర్చి చర్చిస్తారు. తమ బోధలనూ సూచనలనూ పరిష్కారాలనూ తిరుసభ కంతటికీ అందిస్తారు. ఈ సమాఖ్య