పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. క్రీస్తు శ్రీసభ

. IŠ 1. క్రిస్తు -- పురుషుడు -- ఆత్మార్పణం 2. శ్రీసభ -- 芭 ఎఫె 5,22-32. { స్త్రీ一 విధేయురాలు

1. పోలిక

"క్రీస్తు శ్రీసభను ప్రేమించాడు. ఆ సభ కొరకై తన్ను తాను అర్పించుకొన్నాడు. శ్రీసభ క్రీస్తునకు లోబడి వుంటుంది".

పూర్వవేదంలోని ప్రవక్తలు భగవంతునకు ప్రజలకు మధ్యవుండే ప్రేమ భార్యాభర్తల ప్రేమలాంటిది అన్నారు. కాని భార్యాభర్తల ప్రేమ భగవంతునకు ప్రజలకు మధ్య వుండే ప్రేమలాంటిది అనలేదు. అనగా దేవుని ప్రేమ మన ప్రేమలాంటిది అన్నారుగాని, మన ప్రేమ దేవుని ప్రేమ లాంటిది అనలేదు.

ఇక, తొలిసారిగా మనప్రేమను దేవుని ప్రేమతో పోల్చాడు ప్రేషితుడైన పౌలు. అతని భావం ప్రకారం క్రీస్తు వరుడు, శ్రీసభ వధువు. క్రీస్తు ప్రాణాలనే అర్పించి శ్రీసభను వధువుగా పొందాడు. శ్రీసభ వరుడైన క్రీస్తునకు విధేయురాలై వుంటుంది. (ఇక్కడ శ్రీసభ అనగా - క్రీస్తును విశ్వసించే క్రైస్తవ సమాజం)

2. అన్వయం

క్రీస్తు క్రైస్తవ వరునకు పోలికగా వుంటాడు. శ్రీసభ క్రైస్తవ వధువునకు పోలికగా వుంటుంది. జ్ఞానస్నానం పొందిన క్రైస్తవ వధూవరులు ఇద్దరూ వివాహం చేసికోగానే క్రీస్తు శ్రీసభ అనే పోలిక వాళ్ళకు సోకుతుంది. క్రీస్తు శ్రీసభల సంబంధం వాళ్ళకు వర్తిస్తుంది. క్రీస్తు శ్రీసభల వరప్రసాదం వాళ్ళమీద పనిచేస్తుంది.

క్రెస్తవ వివాహంలోని ఘనత అంతాకూడా ఈ పోలికలోనే యిమిడి వుంది. ఈ పోలికే లేకపోతే మన వివాహాలు అన్యమతస్తుల వివాహాలు ఒక్కటే ఔతాయి. అందుకే మనవాళ్ళ జ్ఞానవివాహం చేసుకొమ్మనేది.

3. బాధ్యతలు

మొదట శ్రీసభ, స్త్రీలు : క్రీస్తు శ్రీసభను రక్షించాడు. ఆమె పాపాలను తన నెత్తుటితో కడిగివేసాడు. ఆమెకు వాక్యస్నానం చేయించాడు. ఆమెను తన వధువును చేసికున్నాడు.కావున శ్రీసభ క్రీస్తునకు లోబడి ఉంటుంది. ఇదే విధంగా క్రైస్తవ భార్యకూడ