పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయండి అన్నాడు. అలాగే అతడు భోజనానంతరం పాత్రను అందుకొని ఇది విూ కొరకు చిందబడనున్న నూత్న నిబంధనం యొక్క నారక్తం అన్నాడు - లూకా 22,19-20

“మిరు ఈ రొట్టెను తిన్నపుడెల్ల, ఈ ప్రాంతంనుండి త్రాగినపుడెల్ల, ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారు - 1కొ 11,26.

1. విూది వాక్యాల్లో క్రీస్తు “ఇది నూత్న నిబంధనం యొక్క నా రక్తం" అన్నాడు. పూర్వవేదంలో నెత్తురు చిలకరించడం ద్వారానే సీనాయి నిబంధనం జరిగింది. అక్కడ మోషే కోడె నెత్తుటిని పీఠంమిూదా ప్రజల విూదా చిలకరించి “ఇది ప్రభువు విూతో చేసికొనిన నిబంధనం యొక్క రక్తం అన్నాడు - నిర్గ 24,8. ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొనే క్రీస్తు అంత్యభోజన సమయంలో "ఇది నూత్న నిబంధనం యొక్క నా రక్తం" అన్నాడు. అక్కడ బలిపశువు నెత్తురుద్వారా నిబంధనం జరిగితే ఇక్కడ క్రీస్తు సొంత నెత్తురుద్వారానే నిబంధనం జరిగింది. ఆ నిబంధనం ద్వారా యిస్రాయేలీయులు ప్రభువు సొంత ప్రజలు, పవిత్రజనులు, యాజకరూపమైన రాజ్యం అయ్యారు - నిర్గ 19,5-6. ఇక్కడ ఈ నిబంధనంద్వారా మనం క్రీస్తు ప్రజలం ఔతాం. ఆ పూర్వవేద ప్రజల లక్షణాలే నేడు మనకుకూడ సంక్రమిస్తాయి – 1పేత్రు 2,9.

ఈ సందర్భంలో క్రీస్తు "నూత్న నిబంధనం అనే మాటను పత్ర్యేకంగా వాడాడు. సీనాయి నిబంధనం ప్రాతది. యూదులు దాన్ని విూరుతూ వచ్చారు. కనుక ఆ నిబంధనంవల్ల ఇక ప్రయోజనంలేదు. కావుననే ప్రభువు కొత్త నిబంధనను నెలకొల్పవలసి వచ్చింది. పూర్వవేదంలో యిర్మీయా ప్రవక్త ఈ నూత్న నిబంధనను గూర్చి ముందుగానే తెలియజేసాడు31, 31-33. ఆ ప్రవచనాన్ని మనసులో పెట్టుకొనే క్రీస్తు తనది "నూత్న" నిబంధనం అని చెప్పాడు.

క్రీస్తు నెలకొల్పిన ఈ నూత్న నిబంధనంద్వారా నూత్న సమాజం, మెస్సీయా సమాజం ఏర్పడింది. అదే తిరుసభ, పాత నిబంధనం పాత ప్రజనూ కొత్త నిబంధనం కొత్త ప్రజనూ తయారుచేసాయి. క్రీస్తు పాస్క పండుగ సందర్భంలో అంత్యభోజనాన్ని ఆరగించాడు. యూదులు ఈ పాస్కపండుగను జరుపుకొనేపూడు సీనాయి నిబంధనాన్ని స్మరించుకొనేవాళ్ళు ఆ పాస్క పండుగ సందర్భంలోనే క్రీస్తు నూత్న నిబంధనను నెలకొల్పాడు. దీని భావమేమిటి? ఇక ఆ పాతనిబంధన చెల్లదు. దానికి మారుగా నూత్ననిబంధనం వచ్చింది. రక్షణ చరిత్రలో పాతశకంపోయి నూత్నశకం వచ్చింది. ఈ నూత్నశకమే తిరుసభ ఈలా క్రీస్తు అంత్యభోజనం ద్వారా తిరుసభ స్థాపనాన్ని సూచించాడు

2. ఇంతవరకు అంత్య భోజనాన్ని గూర్చి చూచాం. ఇక దివ్యసత్ప్రసదాన్ని పరిశీలిద్దాం. నూత్న నిబంధనంతో నూత్న ఆరాధనం కూడ ఏర్పడింది. పూర్వ నిబంధనం కలిగినప్పడు ప్రభువు యూదులకు ఒక ఆజ్ఞనిచ్చాడు. అదియిది. ప్రజలు ఆ నిబంధనాన్నీ,