పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయీజిప్టు నిర్గమనాన్నీ తాము చేరుకొనే కనాను దేశంలో గూడ ఏటేట జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈలా జ్ఞప్తికి తెచ్చుకోవడానికే యూదులు పాలస్తీనా దేశంలో ఏటేట పాస్క పండుగ జరుపుకొన్నారు - నిర్గ 12,25-27. అదే వాళ్ళ ముఖ్యారాధన. ఇదే విధంగా క్రీస్తు కూడ తన నూత్న నిబంధన బలిని గూర్చి అనగా దివ్యసత్ప్రాసాదబలిని గూర్చి "దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి" అని చెప్పాడు - లూకా 22, 19. ఇందుకోసమే మనం రోజురోజు పూజబలిని సమర్పించేది. ఈ పూజబలిలో మనం క్రీస్తు మరణాన్ని తండ్రికి జ్ఞాపకం చేస్తాం. తన కుమారుని మరణాన్ని జూచి తండ్రి నేడుకూడ మన పాపాలను మన్నిస్తాడు. ఈ జ్ఞాపకాన్ని మనం క్రీస్తు రెండవసారి తిరిగి వచ్చేదాకా గూడ కొనసాగించుకొనిపోవాలి - 1కొ11,26. నూత్న నిబంధన కాలంలో నూత్న ప్రజల ఆరాధనమే దివ్యసత్రసాదబలి. ఈ నూత్న ప్రజలే తిరుసభ, యూదుల ఆరాధనం పాస్మబలి. మన ఆరాధనం దివ్యసత్రసాద బలి.

ఈ దివ్యసత్రసాద ఆరాధనంలోస్త్రీ పురుషులు ఐక్యభావంతో, ఏక కుటుంబంగా పాల్గొంటారు. ఏక సమాజమౌతారు. ఈ కార్యం తిరుసభలో జరుగుతుంది. దైవ ప్రజలంతా సత్రసాద పీఠంచుటూ ప్రోగైనపుడు తిరుసభ పరిపూర్ణతను పొందుతుంది. కనుక "దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి” అన్నప్రభువు వాక్యాన్నిస్మరించుకొని మనమంతా సంతోషంగా పూజబలికి హాజరు కావాలి. ఈలా హాజరు కావడం ద్వారా తిరుసభ ல்கி చెందుతుంది.

ప్రభువు తన మరణానికి ముందు ప్రేమాజ్ఞను ఇచ్చిపోయాడు. "నేను మిమ్మ ప్రేమించినట్లే మిూరూ ఒకరినొకరు ప్రేమించండి" అన్నాడు-యోహా 13,34-35. దివ్యసత్ర్పసాదబలిలో ఈ ప్రేమాజ్ఞ పరిపూర్ణంగా నెరవేరుతుంది. నూత్న నిబంధనకూ తిరుసభకూ ప్రధానమైంది ఈ ప్రేమాట్టే ఈవిధంగా అంత్యభోజనం ద్వారా, దివ్యసత్ర్పసాద స్థాపనం ద్వారా, క్రీస్తు తిరుసభను స్థాపించ దలచాడని అర్ధం జేసికోవాలి.

రెండవ బాగం

క్రీస్తు తిరుసభను స్థాపించాలని ఉద్దేశించాడు. దాని ఆదిమ సభ్యులైన ప్రేషితులనూ వారి నాయకుడైన పేత్రునీ ఎన్నుకొన్నాడు. తిరుసభ ఆరాధన కొరకు దివ్యసత్రసాదాన్ని స్థాపించాడు. ఐనా తిరుసభ అతని జీవితకాలంలో నెలకొనలేదు. క్రీస్తు ఉత్తానానంతరం, ఆత్మ దిగివచ్చాక అది పుట్టింది. ఈ విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా పరిశీలిద్దాం. అపోస్తుల చర్యలు అనే గ్రంథం నుండి తిరుసభ ఏలా పుట్టి ఏలా పెంపచెందిందో తెలిసికోవచ్చు. ఇక్కడ ఆ చరిత్రను చూద్దాం.