పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అర్థం జేసికోవాలి. ఈలోకంలోని తిరుసభలో పేత్రు క్రీస్తు ప్రతినిధి. అతనికి మించిన అధికారి మరొకడు లేడు.

“భూలోకంలో నీవు దేనిని బంధిస్తావో. విప్పతావో అది పరలోకంలోను బంధింపబడుతుంది, విప్పబడతుంది" - 16,19. బంధించడం, విప్పడం అనేవి రబ్బయి వాడే పారిభాషిక పదాలు. బంధించడం అంటే నిషేధించడం. విప్పడం అంటే అనుమతించడం, కనుక ఇక్కడ పేత్రు నిషేధించేది నిషేధింపబడుతుంది. అనుమతించేది అనుమతింపబడుతుంది అని అర్థం. కాని అతడు నిషేధించేదీ అనుమతించేదీ ఏమిటి? నరులు క్రీస్తు స్థాపించిన దైవరాజ్యంలో చేరాలంటే పాపపరిహారం అవసరం. కనుక ఇక్కడ ప్రభువు పేత్రుకి పాపాలను పరిహరించడానికీ పరిహరించక పోవడానికీ గూడ అధికారాన్ని దయచేసాడని భావం. ఈ సందర్భంలో మత్తయి 18, 18 యోహాను 20, 23 ఆలోకనాలు కూడ చూడదగ్గవి.

పేత్రు చేతిలో దైవరాజ్యపు తాళపుచెవులు వున్నాయి. అనగా అతడు తిరుసభలో పరిపూర్ణాధికారం కలవాడు. కనుక అతడు తిరుసభలో ఎవరి పాపాలనైనా మన్నించవచ్చు ఎవరి పాపాలనైనా మన్నించక పోవచ్చు. అది ఆయాపాపుల హృదయాల్లో పశ్చాత్తాపం వుందా లేదా అనేదాన్ని బట్టి వుంటుంది.

విూద మనం చూచిన భావాల సారాంశం ఇది. క్రీస్తు భవిష్యత్తులో క్రైస్తవ సమాజాన్ని స్థాపించగోరాడు. అది కొనసాగాలంటే దానికి ఓ అధికారి అంటూ వుండాలి. ఆ యధికారి పేత్రు. ఈ భవిష్యత్ సమాజం తీరుతెన్నులు క్రీస్తు అప్పడే సవివరంగా నిర్ణయించలేదు. భవిష్యత్తులో ఆత్మ వచ్చాక ఈ తీరుతెన్నులు రూపుతాలుస్తాయి. పేత్రు మాత్రం ఈ సమాజానికి తిరుగులేని అధిపతి. ఈ సమాజమే తిరుసభ, పేత్రు ఆధిపత్యం అతని అనుయాయులకు కూడ సంక్రమిస్తుంది. ఈ విషయాన్ని మిదట చూస్తాం.

4. దివ్యసత్ఫ్రసాద స్థాపనం

అంత్య భోజనమూ దివ్యసత్ర్పసాద స్థాపనమూ క్రీస్తు తిరుసభను నెలకొల్ప గోరాడని రుజువు చేస్తాయి. కనుక ఇక్కడ ఈ రెండంశాలను పరిశీలిద్దాం. మొదట అంత్య భోజనాన్ని చూద్దాం.

అంత్యభోజన వాక్యాలు మూడు సువిశేషాల్లోను వున్నాయి. ప్రస్తుతానికి మనం లూకా పౌలుల వాక్యాలను తిలకిస్తే చాలు.

"అపుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి, దాన్ని త్రుంచి శిష్యులను ఒసగుతూ ఇది విూ కొరకు అర్పింపబడనున్ననా శరీరము. దీన్నినా జ్ఞాపకార్థం