పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృద్ధుడు వూతకర్రమిదలాగ అతడు ఆమెమీద, ఆమె అతనిమీద ఆధారపడుతూ వండాలి. (సహాయం అనే హీబ్రూ పదానికి అర్థం ఇది). వాళ్ళిద్దరూ దేవునిమిద ఆధారపడుతూ వుండాలి.

3. సంతానం

"మీరు సంతానాన్ని కని అభివృద్ధి చెందండి. భూమి విూద వ్యాపించి దాన్ని వశపరచుకోండి" - ఆది 1,28.

సంతానం దేనికి? నరుడు దేవుని ప్రతిబింబం అన్నాం. భగవంతుని మహిమను ప్రకాశింపజేసేవాళ్లు నరులు. కావున నరులు ఈ నేలమీద సంచరించేలా చేయడం కోసం ఆదిదంపతులు సంతానం కనాలి. దేవుడు తొలిదంపతుల్ని తానే సృజించాడు. ఆ మీదట మనుష్యప్రాణుల్ని మనుష్యుల ద్వారాకాని సృజింపడు.

ఇక్కడ వివాహంయొక్క తొలిధర్మం సూచింపబడింది. పూర్వవేద ప్రజలు సంతానాన్ని మక్కువతో వాంఛించారు. బిడ్డల్ని కనటమంటే ప్రభువు ఆశీర్వాదాన్ని పొందటం, సంతానం లేకపోవడమంటే దైవశాపానికి గురికావడం,

4. పరస్పర ప్రేమ

“ఈవిడనా ఎముకల్లో ఎముక, నా శరీరంలో శరీరం. నరునినుండి కలిగింపబడింది కనుక యీవిడ నారి అనబడుతుంది. కావున పురుషుడు తల్లిదండ్రులనుగూడ విడచి భార్యకు హత్తుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిగా ఐక్యమౌతారు" - ఆది 2,23-24.

ఆదాము ఏవనుచూచి "ఈవిడ నా ఎముకల్లో ఎముక. శరీరంలో శరీరం" అనుకున్నాడు. దగ్గరిబంధువురాలు అని యీ మాటల భావం. ఆమె అతని దేహంనుండి పుట్టింది. అచ్చంగా అతని కోవకే చెందింది. అందుకే అతడు నరుడైతే, ఆవిడ నారి. ఇక, వాళ్ళిద్దరి సంబంధం చాల సన్నిహితమైంది. అతడు, ఆమె గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరితో ఒకరు ఐక్యమౌతారు. ఇద్దరైనాగూడా ఒకేవ్యక్తిగా కూడుకొనిపోతారు. అలా కూడుకొని ఒకరికొకరు సహాయపడతారు. బిడ్డల్ని కంటూవుంటారు. పురుషుడు తల్లిదండ్రులనుగూడ వదలిపెట్టి భార్యతో జీవిస్తాడు. క్రొత్త కుటుంబం ఏర్పరచుకుంటాడు. ఇక్కడ భార్యాభర్తల పరస్పర ప్రేమభావం, సహాయభావం సూచింపబడింది. ఇది వివాహపు రెండవ ధర్మం.