పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావున ఆదిదంపతులను వర్ణించిన హీబ్రూ రచయిత దృష్టిలో వివాహధర్మాలు రెండు : సంతానం, పరస్పర ప్రేమ. ఇవి రెండూ బైబులు సూచించే ప్రధాన ధర్మాలు. పూర్వవేదంలో వేరే తావుల్లోకూడ వివాహపు ప్రస్తావన వస్తుంది.

5. ఇతర భావాలు

యావే ప్రభువు యిస్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసికొన్నాడు. ఈ యొడంబడికను వివాహంగా భావించారు ప్రవక్తలు. యావే నరుడు. యిస్రాయేలు ప్రజ వధువు, “నిన్ను సృజించిన ప్రభువే నీ భర్త" అంటాడు యెషయా ప్రవక్త - 54,5. "ఎడారి కాలంలో ఒక వధువులా నన్ననుసరించి వచ్చావు" అంటాడు యిర్మీయా ప్రవక్త -2,2.

అబ్రాహాము తన భార్యయైన సారను గాఢంగా ప్రేమించాడు. సార అతనికి లోబడి వుండేది. అనురాగంతో అతన్ని 'ప్రభూ' అని పిలిచేది. వీళ్ళకుటుంబములో నుండే మెస్సీయా జన్మించింది. వీళ్ళలాగే తోబియా సార కూడ ప్రేమిజీవితం జీవించిన ఆదర్శ దంపతులు.

కీర్తనకారులు వివాహజీవితాన్ని ఉదాత్తభావాలతో వర్ణించారు. "నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షలతలా ఉంటుంది. భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఓలివమొక్కల్లా కనబడతారు. ప్రభువుపట్ల భయభక్తులు చూపే గృహస్థు ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుతాడు” - కీర్తన 128,3-4

మరో కీర్తనకారుడు పెండ్లికుమార్తెను ఇలా హెచ్చరించాడు - కీర్తన 45,10-11.
"కుమారీ! సావధానంగా విను
నీ పుట్టింటిని సొంత జనాన్ని యిక మరచిపో
ఈ రాజు నీ ప్రభువు
నీ సౌందర్యాన్ని కోరినవాడు ఇతడే
ఇతనికి నమస్కరిస్తూ వుండు."

6. పాపానంతరం వివాహదశలో మార్పు

పాపం తర్వాత ఆదిదంపతుల వివాహదశలో పెద్దమార్పు వచ్చింది. పూర్వమున్న భాగ్యస్థితిపోయి దౌర్భాగ్యస్థితి పట్టుకొంది. ఆదాము ఏవకు సహచరుడు కావడం మానివేసి నియంత అయ్యాడు. ఏవ ఆదాముకు సహాయురాలు కావడానికి బదులు బానిస ఐంది - ఆది 3,16. దేవుడు ఆదామును నిలదీయగా అతడు తాను తినగూడని పండు తినడానికి.