పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. ఆదిదంపతులు

1, 26-28 పోలిక, సంతానం. ఆదికాండం : 2,18-24 సహాయురాలు, ఇద్దరూ ఒకే వ్యక్తి

1. పోలిక

“దేవుడు తనకు పోలికగా నరుని సృజించాడు. ఆ నరుని స్త్రీ పురుషలనుగా సృజించాడు" - ෂධී 1,27.

దేవుడు పిడికెడు మట్టిముద్దను తీసికొని తన శ్వాసను దానిలోనికి వూదాడు. దేవుని శ్వాస అంటే అతని ఆత్మ ఈ ఆత్మను పొంది ఆ మట్టిముద్ద సజీవప్రాణి ఐంది. ఆ ప్రాణి ఆదాము. ఈ ఆదామునుండి స్త్రీ సృజింపబడింది . నరుడు దేవునికి పోలికగా వుంటాడు. ఆకాశంలోని పక్షులు, భూమిమీది జంతువులు, నీళ్ళలోని చేపలు మొదలైన సృష్టి ప్రాణులన్నీగూడ అతని అధీనంలో వుంటాయి - కీర్తన 8,7.

ఆదాము ఏవలు ఆదిదంపతులు. ఈ ఇద్దరూ దేవుని ప్రతిబింబాలే. వీళ్ళిద్దరిలోను దేవుని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ దేవుని బిడ్డలే. ఇద్దరూ దేవుని చేరవలసినవాళ్ళే కావున వాళ్ళల్లో హెచ్చుతగ్గులంటూ లేవు. వాళ్ళ గుణగణాలు, శక్తిసామర్థ్యాలు వేరు. ఐనా దేవుని ఎదుట వాళ్ళ విలువ ఒకటే.

2. సహాయురాలు

‘నరుడు ఒంటరిగా వుండడం మంచిదికాదు. అతనికి యోగ్యమైన సహాయురాలిని సృజిస్తాను" అని అనుకున్నాడు ప్రభువైన యావే - ఆది 2,18.

నరుడు ఒంటరిగా వుండడం మంచిదికాదు. అంచేత అతనికి సహాయురాలునిగా ఏవను సృజించాడు యావే. ఇక్కడ సహాయురాలంటే అతణ్ణి పరిపూరుణ్ణి చేసే ప్రాణి. జంతువులను సృజించి ఆదామునకు చూపించాడు ప్రభువు. ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. అనగా వాటిమీద అధికారం పొందాడు. కాని ఆదామునకు సహాయపడే సాటిజంతువు వాటిల్లో లేదు. వాటి స్థితి వేరు, అతని స్థితి వేరు. అంచేత అతనికి సహాయపడగలిగే వ్యక్తిని, ఏవను; ప్రభువు ప్రత్యేకంగా సృజించాడు. ఆమె లేనిదే అతడు పరిపూర్ణ ప్రాణికాలేడు. సంతానాన్ని పొంది అభివృద్ధిలోనికి రాలేడు. అతడు లేనిదే ఆమెకూడ పరిపూర్ణురాలు కాలేదు.