పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయశీలుడుగాను మహిమాన్వితుడును గాను వచ్చి యావే తరపున శత్రువులతో పోరాడి విజయాన్ని సాధించి దైవరాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకొన్నారు. ఆరోజుల్లో అన్యజాతులన్నీ యిస్రాయేలీయులకు లొంగిపోతాయనీ లోకంలో న్యాయయుక్తమైన పరిపాలనం నెలకొంటుందనీ ఎంచారు. క్రీస్తు వచ్చినపుడు అతడు ఈ రాజకీయ భావాలను అంగీకరించలేదు. ఐనా నూతవేదంలో ఈ రాజకీయ భావాలు అక్కడక్కడా తగులుతాయి. జెబెదయి కుమారులిద్దరు దైవరాజ్యంలో ప్రముఖ పదవులు పొందాలని కోరారు - మార్కు 10,37. క్రీస్తు యెరూషలేము ప్రవేశించేపుడు ప్రజలు దావీదు రాజ్యం రావాలని అరచారు - 11,10. ఎమ్మావు శిష్యులు క్రీస్తు యిప్రాయేలు రాజ్యాన్ని ఉద్ధరిస్తాడు అనుకొన్నారు - లూకా 24,21. ప్రజలు యేసుని రాజుని చేయాలని భావించారు - యోహా 6,15. ప్రభూ! నీవు యిప్రాయేలు రాజ్యాన్ని ఉద్ధరించవా అని శిష్యులు ఉత్తాన క్రీస్తుని అడిగారు - అ, చ, 1,16.

ఈ యుగంలో దైవరాజ్యాన్ని గూర్చిన యూదుల భావాలు సంగ్రహంగా ఇవి. రాజైన మెస్సియా యిప్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడు. అతడు యిస్రాయేలు శత్రువులతో ఫరోరయుద్ధం జరిపి వారిని ఓడించిన పిదపనే గాని ఈ రాజ్యస్థాపనం జరగదు. లోకంలోని జాతులన్నీ యిస్రాయేలు రాజ్యంలో చేరి దానికి లొంగి వుంటాయి. ఈ రాజ్యంలో శాంతీ సిరిసంపదలూ దైవభక్తి సమృద్ధిగా నెలకొంటాయి.

2) రబ్బయిలు కోరుకొన్న దైవరాజ్యం

యూదుల బోధకులైన రబ్బయిలు ఈలోకంలో ప్రజలు యావేకు సాక్షులుగా వండాలని కోరారు. యావేను ఆరాధించడం ద్వారాను, ధర్మశాస్రాన్ని పాటించడం ద్వారాను వాళ్ళు అతనికి సాక్షులుగా వుంటారు. ప్రజలు తమ పాపాలకు పశృత్తాపపడి ధర్మశాస్తాన్ని చక్కగా పాటిస్తే పరాయిపాలనం అంతరించి దైవరాజ్యం త్వరలోనే వస్తుందని రబ్బయిలు బోధించారు. కనుక వీళ్ళ భావాలప్రకారం, ప్రజల విశుద్ధవర్తనమే దైవరాజ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈసందర్భంలో లెవి అనేరబ్బయి ఈలా నుడివాడు. “యిస్రాయేలీయులు ఒక్కరోజు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటేచాలు వాళ్ళకు దాస్యవిముక్తి శీఘ్రమే లభిస్తుంది. దావీదుకుమారుడు కూడ వెంటనే వస్తాడు." రబ్బయిలు, అంత్యకాలంలో మెస్సియా వచ్చి దైవరాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పారు. దైవచిత్తానికి సమ్మతమైనప్పడుకాని దైవరాజ్యంరాదు అనికూడ బోధించారు.

3) దారునిక వాదుల దైవరాజ్యం

పైన మనం చూచిన రాజకీయవాదులూ రబ్బయిలూ దైవరాజ్యం ఈ భౌతిక లోకంలోనే, ఈయుగంలోనే వస్తుందనుకొన్నారు. కాని దారునిక వాదులు దైవరాజ్యం 95