పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ భౌతిక లోకంలోగాక పూర్తిగా మార్పుచెందిన మరోలోకంలో వస్తుందని నమ్మారు. మెస్సీయా ఈ యుగంలోగాక మరోయుగంలో వస్తాడని నమ్మారు. వీళ్ళ భావాల ప్రకారం సూర్యచంద్రాది గ్రహాలు నశిస్తాయి. ఈలోకం అంతరిస్తుంది. నూతదివీ నూత్నభువీ ఏర్పడతాయి. ఆ యుగం మన చరిత్రకు సంబంధించింది కానేకాదు. అది క్రొత్తయుగం. క్రొత్త సృష్టి ఆ యుగంలోగాని దైవరాజ్యం నెలకొనదు. ఆ యుగంలో దేవునికీ దుష్టశక్తులకీ మధ్య ఫరోరయుద్ధం జరుగుతుంది. ఆ దుష్టశక్తులన్నీవోడిపోతాయి. ఈ ప్రస్తుత భౌతికలోకం అంతరిస్తుంది. న్యాయతీర్పు జరుగుతుంది. మృతులు ఉత్తానమౌతారు. అప్పడేగాని దైవరాజ్యంరాదు. యెషయా 24-27అధ్యాయాలు, దానియేలు 7వ అధ్యాయం ఈ భావాలను పేర్కొంటాయి.

క్రీస్తునాడు యూదుల్లో ఈ మూడు వర్గాలవారి భావాలు కలగాపులగంగా ప్రచారంలో వుండేవి. అప్పుడు అన్యజాతివాళ్ళయిన రోమియులు పాలస్తీనా దేశాన్ని పరిపాలిస్తుండేవాళ్లు కనుక ఆనాటి యూదులందరూ దాస్యవిముక్తిని కోరుకొన్నారు. మెస్సీయా శీవఘ్రమే విచ్చేసి రోమిూయులను జయించి యూదుల రాజ్యాన్ని స్థాపిస్తాడనుకొన్నారు. అతని ఆగమనం కొరకు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. అంతటా అశాంతి నెలకొనివుంది. అలాంటి ఉద్రిక్తపరిస్థితుల్లో క్రీస్తువచ్చి దైవరాజ్యాన్నిగూర్చి బోధించడం మొదలెట్టాడు. ఈ దైవరాజ్యం కొరకే యూదులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. కనుక అతని బోధలను వాళ్ళు శ్రద్ధతో విన్నారు.

3. క్రీస్తు బోధించిన దైవరాజ్యం

క్రీస్తు బోధల్లోని ముఖ్యాంశం దైవరాజ్యమే. "కాలం పరిపూర్ణమైంది. దైవరాజ్యం సమిూపించింది. మి పాపాలకు పరివర్తనంచెంది సువార్తను విశ్వసించండి" అనే వాక్యాలతోనే అతడు తన బోధను ప్రారంభించాడు - మార్కు 1,15. అతని వుపదేశాలన్నీ ఏదో రూపంలో దైవరాజ్యానికి సంబంధించినవే. అంత్యకాలంలో దైవరాజ్యాన్ని గూర్చి బోధించడానికే తండ్రి అతన్ని పంపాడు.

క్రీనునాడు అంత్యకాలంలో దైవరాజ్యం వస్తుందని యూదులంతా నమ్ముతుండేవాళ్ళు దానికోసం గంపెడాశతో ఎదురుచూస్తుండేవాళ్లు, ఆ దైవరాజ్యం రానేవచ్చిందని క్రీస్తు బోధించడం మొదలెట్టాడు. కనుక బెల్లానికి ఈగల్లాగ జనమంతా అతనిచుట్టు మూగి అతని బోధలు శ్రద్ధగా విన్నారు.

కాని అంత్యకాలంలో రాబోయే దైవరాజ్యాన్ని గూర్చి ఆనాటి ప్రజలు తలంచిన తీరువేరు. ప్రజలు రాజకీయమైన దైవరాజ్యం కొరకు