పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ కాలంలో ఒక్క నరులకు మాత్రమే కాక ప్రాణికోటికంతటికీ, సృష్టికంతటికీ దేవునితో మళ్ళా రాజీకుదురుతుంది. పూర్వం ఏదెనులో వున్న శాంతి సమాధానాలు మల్లా నెలకొంటాయి. కనుక ఈ యంత్యకాలం దేవుడు చేసే గొప్పవిందులాంటిది - యోష 25,6=8.

యిప్రాయేలీయులు దేవుని నిబంధనను మిూరడంచే అశాంతి యేర్పడింది. అంత్యదినాల్లో దేవునికీ యిస్రాయేలీయులకీ మధ్య మల్లా శాంతి నెలకొంటుంది. ఆ కాలంలోని ప్రజలంతా తమతోతాము, ప్రకృతితో తాము, శాంతియుతంగా జీవిస్తారు. ప్రభువు కరుణతో ప్రజల పాపాలను మన్నిస్తాడు. కనుక శాశ్వత శాంతి నెలకొంటుంది. అటుతర్వాత ప్రజలు మళ్ళా దేవుని నిబంధనను మిూరరు. ఇవన్నీ అంత్యకాలంలో జరుగుతాయి. ఆ కాలం మెస్సీయా వచ్చేకాలం, దైవరాజ్యం పెంపజెందేకాలం.

2. పూర్వవేదాంత కాలంలో దైవరాజ్యం

పైన మనం చూచినవి పూర్వవేద భావాలు. కాని క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం తర్వాత దైవరాజ్యాన్ని గూర్చిన యూదుల భావాలు క్రమేణ మారాయి. క్రీస్తు బోధించినపుడు ఈ మార్పు చెందిన భావాలే యూదుల్లో ఎక్కువగా ప్రచారంలో వుండేవి. కనుక మనం వీటినిగూర్చి కూడ తెలిసికోవాలి. మనం ఇక్కడచూచే భావాలు క్రీ.పూ.200 నుండి క్రీ.శ. 150వరకు ప్రచారంలోవున్నవి. ఇవి బైబులు భావాలు కావు, ఆనాటి యూదుల భావాలు మాత్రమే. ఇక్కడ మూడంశాలు పరిశీలిద్దాం .

1) రాజకీయవాదుల దైవరాజ్యం

యూదులు, యావే తన ప్రతినిధియైన మెస్సియాను రాజుగా పంపుతాడు అనుకొన్నారు. అతనిక్ "దావీదు కుమారుడు" అని బిరుదు. అతడు అన్యజాతుల పాలనంనుండి యిస్రాయేలు రాజ్యాన్ని ఉద్ధరిస్తాడు. యూదుల దారిద్ర్యాన్ని కూడ తొలగిస్తాడు. అతని కాలంలో యూదులు దేవుణ్ణి పూర్ణహృదయంతో సేవిస్తారు. ధర్మశాస్తాన్ని పరిపూర్ణంగా పాటిస్తారు. జెకర్యా గీతం ఈ భావాన్నే సూచిస్తుంది. “అతడు మనలను ద్వేషించే శత్రువులనుండి మనలను కాపాడతాడు. జీవితకాలమంతా మనం నీతితోను పవిత్రతతోను దేవుణ్ణి సేవిస్తాం - లూకా 1,71-75. యూదుల్లో "ఆసక్తి వరులు" అనే ఉగ్రవాదుల వర్గంకూడ వుండేది. పాలస్తీనా దేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందాలని వీళ్ళ ప్రబల వాంఛ. ఆయుధాలతో శత్రువుల నెదుర్కోవాలని వీళ్ళ సంకల్పం. ఈ ధర్మయుద్ధంలో యావే వీళ్ళ తరపున పోరాడతాడని వీళ్ళ నమ్మకం. కనుక ఆ రోజుల్లో యూదులు దైవరాజ్యమనే భావాన్ని రాజకీయాలతో ముడిపెట్టారు. మెస్సియా