పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. యూదుల పాస్క

పాస్క అనే గ్రీకుమాట పేసా అనే హీబ్రూమాటకు అనువాదం. దాటిపోవడం అని ఈ పదాలకు అర్థం. యిప్రాయేలు ప్రజలు తమ యిండ్ల గడపలకు గొర్రెపిల్ల నెత్తురు పూసారు. ఆ నెత్తురును చూచి దేవదూత వారిండ్లు దాటిపోయాడు. వారి బిడ్డలకు హానిచేయలేదు. అతడు ఆ నెత్తురు పూతలేని ఈజిప్టు ప్రజల యిండ్లలోనికిపోయి వారి తొలిచూలు పిల్లలను చంపివేసాడు - నిర్గ 12, 13. కనుక పాస్క అనేమాటకు క్రమేణ వదలివేయడం, రక్షించడం, కాపాడ్డం అనే అర్థాలు వచ్చాయి.

అబ్రాహాము, ఈసాకు యాకోబులనాడే యావే ప్రభువు యిప్రాయేలీయులతో ఒడంబడిక చేసికొన్నాడు. వారిని కాచికాపాడతానని శపథం చేసాడు. వాళ్లు ఫరోచక్రవర్తికి బానిసలై మ్రగ్గిపొవడం అతడు సహించలేక పోయాడు. కనుక వారిని ఈజిప్టు నుండి విడిపించుకొని రావడానికి కంకణం కట్టుకొన్నాడు. ఈజిప్టు నిర్గమనం యిస్రాయేలు రక్షణ చరిత్రలో కొండశిఖరం లాంటిది.

యిస్రాయేలీయులు ఈజిప్టు బానిసంలో చిక్కి ఆక్రందనం చేయగా ఆ యేడ్పు యావే చెవిని పడింది - నిర్గ 2, 23. వారిని ఫరోచక్రవర్తి ఇనుపపిడికిళ్ళ నుండి విడిపించాలని దేవుడు నిశ్చయించుకొన్నాడు 3,7. ప్రభువు ఈజిప్టులో ఆ ప్రజల కొరకు పది అద్భుతాలు చేసాడు. శత్రువుల మీదికీ మిడతలు, కప్పలు, దోమలు, రోగాలు, వడగండ్లు, చీకట్ల మొదలైన వాటిని పంపాడు. చిట్టచివరి కార్యం తొలిచూలి మగబిడ్డలను చంపివేయడం. దేవుని ఆజ్ఞపై ప్రజలు తమగడపలకు గొర్రెపిల్ల నెత్తురు పూసికొన్నారు. అర్థరాత్రిలో దేవుని దూత దిగివచ్చాడు. అతడు గడపలకు నెత్తురు పూసివున్న యిండ్లకు ఏ హాని చేయకుండా దాటిపోయాడు. నెత్తురు పూతలేని యీజిష్ఠీయుల ఇండ్లలోకి వెళ్లి తొలిచూలు బిడ్డలను హతమార్చాడు 12,13,27. కనుక గొర్రెపిల్ల నెత్తురు యూదులకు రక్షణమూ, వారి శత్రువులకు శిక్షణమూ తెచ్చిపెట్టింది.

దేవదూత యూదుల యిండ్లను దాటిపోయాక ఆ ప్రజలు మోషే నాయకత్వాన రెల్ల సముద్రాన్ని దాటిపోయారు. ఇదికూడ రక్షణమే. మోషే తర్వాత యోషువా వారిని యోర్గాను దాటించి కనాను దేశంలో చేర్చాడు. ప్రజలు ఆ దేశాన్నిచేరుకోగానే గిల్లాలువద్ద మొదటి పాస్క జరుపుకొన్నారు- యోషు 5,10.

పాస్క పండుగ యూదుల పండుగ లన్నింటిలోను శ్రేష్టమైంది. ఈ పాస్క సంఘటనం ద్వారా దేవుడు ఆ ప్రజలను 400 యేండ్ల బానిసం నుండి విడిపించాడు. వారిచే సముద్రాలు, ఎడారులు దాటించాడు. మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా తానుకూడా