పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారితో 40 ఏండ్లపాటు ప్రయాణం చేసాడు. కనుక ఈ సంఘటనం వాళ్ల మనసులమీద చెరగని ముద్రవేసింది. వాళ్ళ దాన్ని పాలస్తీనా దేశంలో ఏటేట వుత్సవంగా జడుపుకొన్నారు. ఈ పండుగ 50 రోజులు కొనసాగేది. ఈ పండుగలో ప్రజలు గొర్రెపిల్ల నెత్తురు తమకేలాగ స్వేచ్ఛను ప్రసాదించిందో, తమ్మేలాగ రక్షించిందో గుర్తుతెచ్చుకొన్నారు. ఆ నెత్తురు తమకు జీవమిచ్చిందని అర్థం చేసుకొన్నారు. తాము పాస్కసంఘటన స్మృతిని మర్చిపోకూడదని నిశ్చయించుకొన్నారు.

ఈ పాస్క గొర్రెపిల్ల స్మృతిలో పూర్వ సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకోవడం, భవిష్యత్తుకు సిద్ధంగావడం అనే రెండంశాలు వున్నాయి. పాస్క తిరునాళ్ళలో యిస్రాయేలు సమాజంమంతా పూర్వ సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకొన్నారు. తమ బానిసమూ, ప్రభువు ఆదుకోలూ గొర్రెపిల్ల నెత్తురు తమ్ము రక్షించినతీరూ మొదలైన సంఘటనలన్నీ గుర్తుతెచ్చుకొన్నారు. ఇంకా వాళ్ళ భవిష్యత్తుకుకూడ సిద్ధమయ్యారు. భావికాలంలో దేవుడు తమ్మకాచికాపాడతాడనీ, తమ తరఫున తాము దేవునికి విధేయులైయుండాలనీ ఎంచారు. ఈలా పాస్క ఉదంతం వారి జీవితాల్లో మరపురాని సంఘటనమైంది.

యూదులకు పాస్క కేవలం మనసునకు చెందిన సంఘటనం మాత్రమే కాదు. పాస్క చరిత్ర వారి కన్నులకు కట్టినట్లుగా కన్పించేది. వాళ్లు ఏటేట పాస్క విండును భుజించేపుడు చేదు దుంపలు తినేవాళ్ళు అవి వాళ్లు పడిన శ్రమలకు గుర్తు పొంగని రొట్టెలను గొర్రెపిల్లను ఆరగించేవాళ్ళు, కుటుంబ యజమానుడు రొట్టెరసాలపై ఆశీర్వచనాలు పలికేవాడు. ఈ కార్యాలన్నిటివల్ల తొలి దాస్యవిముక్తి యూదులకు బాగా అనుభవానికి వచ్చేది. వాళ్ళ భగవంతుని కరుణను ప్రేమను బాగా అర్థంచేసికొనేవాళ్ళ ఈ పాస్క చరిత్రలో గొర్రెపిల్ల నెత్తుటిని గడపలకు పూయడమూ తర్వాత ఆ జంతువుని భుజించడమూ ప్రముఖాంశాలు అయ్యాయి.

2. క్రీస్తు పాస్క

క్రీస్తు నజరేతులో సంప్రదాయ కుటుంబంలో పుట్టిపెరిగాడు. ప్రవక్తల గ్రంథాలు బాగానే జీర్ణంచేసికొన్నాడు. విశ్రాంతి దినాన్నిపాటించాడు. ధర్మశాస్తాన్ని అభిమానించాడు. యిస్రాయేలు భక్తికి పునాదులైన ఈజిప్టు పాస్క సీనాయి నిబంధనం మొదలైన ఘట్టాలను భక్తితో మననం జేసికొన్నాడు.

ఆ రోజుల్లో యూద ప్రజలు గంపెడాశతో మెస్సీయా కొరకు ఎదురు చూస్తున్నారు. 89 మెస్సీయా రాజకీయనాయకుడుగాను రణవీరుడుగాను వచ్చి రోమను ప్రభువులతో యుద్ధం చేస్తాడు అనుకొన్నారు. అతనికి సైనిక బలం, ధనరాసులు, డాబు దర్పం