పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. పాస్క సత్ప్రసాదము, హింసలు

బైబులు భాష్యం - 149

విషయసూచిక

1. యూదుల పాస్క
2. క్రీస్తు పాస్క
3. తొలినాటి క్రైస్తవుల పాస్క
4. 21వ శతాబ్దపు పాస్క

భారతదేశ తిరుసభ 2001 సంవత్సరాలు ముగించుకొని మూడవ వేయి సంవత్సరంలోనికి అడుగిడింది. ప్రస్తుతం భారత తిరుసభ వేదహింసలను ఎదుర్కొంటోంది. మతతత్వవాదులు తిరుసభను అణగదొక్కి క్రైస్తవులను నాశం చేయాలని చూస్తున్నారు. ఈ దేశంలో నూత్నంగా యెవ్వరూ క్రైస్తవ మతాన్ని స్వీకరించ గూడదని శాసిస్తున్నారు.

పోయిన పదేండ్లల్లోనే భారతదేశ తిరుసభ ఎన్నో హింసలకు గురై విలవిల్లాడిపోయింది. గుజరాతులో గిరిజన క్రైస్తవులను ముప్పతిప్పలు పెట్టారు. 1999లో ఒరిస్సాలో గ్రహాం స్టెయిన్సునీ అతని ఇద్దరు కుమారులనూ సజీవదహనం చేసారు. ෂධී యేడు అదే రాష్ట్రంలో అరుల్ దాస్ అనే గురువుని బాణాలు రువ్వి చంపారు. అదేయేడు బీహారులో ఒక మఠకన్యను వివస్త్రనుచేసి అవమానించారు. రాంచీలో తోమసు అనే గురువుని హతమార్చారు. రెండవవేయి సంవత్సరంలో ఆంధ్ర, కర్నాటక, గోవా రాష్ట్రాలలో క్రైస్తవ దేవాలయాలను ధ్వంసం చేసారు. కొన్ని తావుల్లో బైబుళ్ళ తగలబెట్టారు. ఇవీ యింకా యితర సంఘటనలూ క్త్రెస్తవులు వేదహింసలకు గురౌతున్నారని ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈ హింసలకు కారణాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ మతపరమైనవి.

ఈ సందర్భంలో క్రైస్తవులమైన మనం ఆత్మ పరిశీలనం చేసికోవాలి. మనమట్టుకు మనం భక్తిగా, క్రీస్తు శిష్యులంగా జీవిస్తున్నామా! మన గురువే మనకు హింసలు తప్పవని చెప్పలేదా? పూర్వం యూదులు, అటు తర్వాత క్రీస్తు పాస్కశ్రమలు అనుభవించలేదా? క్రీస్తు పాస్క అంటే అతని మరణోత్థానాలు కాదా? క్రీస్తుపాస్క ఈనాడు మన దివ్యసత్రసాద బలిలో కొనసాగడంలేదా? మన గురువుతోపాటు మనం కూడ కొన్ని శ్రమలు అనుభవించి ఉత్తానం కావద్దా?

ప్రస్తుతం మనం నాల్గంశాలు పరిశీలించాలి. 1.యూదులు పాస్క2. క్రీస్తుపాస్క 3. తొలినాటి క్రైస్తవుల పాస్క4, 21వ శతాబ్దంలో భారత క్రైస్తవుల పాస్క