పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2.వేదవాక్కులో గూడ ప్రభువు వుంటాడు. పూజలో ఆ వేదవాక్కును చదివి విన్పించేపుడు అతని వాక్కే విన్పిస్తుంది. 8, పూజనర్పించే గురువులో అతడు వుంటాడు. పూర్వం సిలువమీద తన్నుతాను అర్పించుకొన్న క్రీస్తు ఇప్పడు పూజలో గురువుద్వారా మళ్ళా ఆత్మార్పణం చేసికొంటాడు. 4 కడన దివ్యసత్రసాదంలో ప్రభువు వుంటాడు. పైమూడు సాన్నిధ్యాల కంటె గూడ ఇది విలువైంది. ఇక్కడ వున్నంత పరిపూర్ణ సాన్నిధ్యం మరెక్కడా వుండదు. పూజలో పాల్గొనే భక్తులు ఈ నాలురకాల సాన్నిధ్యాలను, విశేషంగా కడపటిదాన్ని భక్తిభావంతో గుర్తించాలి. 2. దివ్యసత్రసాదం కంటికి రొట్టెలాగే ద్రాక్ష సారాయంలాగే కన్పిస్తుంది. వాటిని క్రీస్తు శరీరరక్తాలనుగా అంగీకరించాలంటే విశ్వాసం వుండాలి. ఈ విశ్వాసాన్ని గూర్చి నాల్గవ శతాబ్ద భక్తుడు సిరిల్ ఈలా వ్రాసాడు. “ఆ పదార్థాలు రొట్టెరసాలు కాదు. ప్రభువు వాక్యాన్ని బట్టి అవి అతని శరీరరక్తాలే అనుకోవాలి. కండ్ల నాలుక మొదలైన యింద్రియాలు అవి రొట్టెరసాలేనని చెప్పినా నీ విశ్వాసం మాత్రం అలా కాదని చెప్పాలి. రుచినీ రూపాన్నీ బట్టి వాటిని నిర్ణయించకూడదు. విశ్వాసంతో అవి క్రీస్తు శరీరరకాలేనని ఏ యనుమానమూ లేకుండా అంగీకరించాలి." ఈ విశ్వాసాన్ని మనం ప్రభువు నుండే అడుగుకోవాలి. 3. పై సిరిల్ భక్తుడే ఇంకా యిలా వ్రాసాడు. "క్రీస్తు శరీరరక్తాలను రొట్టెరసాల రూపంలో భుజిస్తాం. అలా భుజించినపుడు మన శరీరరకాలు ప్రభువు శరీరరకాలతో మిళితమై పోతాయి. అతని దేహరుధిరాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కనుక మనం క్రీస్తుధరులమైతాం." క్రీస్తుని భుజించి క్రీస్తుధరులయ్యే భక్తులు ఆ క్రీస్తుకి యోగ్యంగా నడుచుకోవాలి. 4. నాల్గవ శతాబ్ద భక్తుడైన అగస్టీను ఈలా చెప్పాడు. "క్రీస్తు తన శరీరరక్తాలతో మనకు హితకరమైన భోజనం పెడతాడు. కనుక అతని శరీరాన్ని భుజించేవాళ్ళ జీవాన్నే భుజిస్తారు. అతని రక్తాన్ని త్రాగేవాళ్ళ కూడ జీవాన్నే త్రాగుతారు. ఈ దివ్య భోజనాన్ని భుజించడం ద్వారా మనం జీవాన్ని పొందుతాం, ఆ జీవాన్ని కూడ సమృద్ధిగా పొందుతాం.? అగస్టీను నుడివినట్లుగా ఈ దివ్యభోజనం ద్వారా మనం పరిపూర్ణ జీవాన్ని పొందాలి,

8.సాద ఆరాధనా, సంద సత్ర్పర్శనాలూ

"ప్రభువు దివ్యసత్రసాదాన్ని భోజనంగా వుండడానికే నెలకొల్పాడు. కనుక మనం • దాన్ని ఆరాధించ నక్కరలేదు అని అనుకోకూడదు.” - బ్రెంటు మహాసభ