పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. వివరణం

1. రచయిత తన్నుతానే దేవుణ్ణి స్తుతించడానికి ఆహ్వానించుకొంటున్నాడు. ప్రాభవ వైభవాలు రాజలక్షణాలు. దేవుడు వీటిని బట్టల్లా ధరిస్తాడు. అనగా దేవుడు ప్రకృతి సౌందర్యంలో రాజఠీవితో దర్శనమిస్తాడు. ప్రకృతిలో గోచరించే దేవుని మహిమను ఏర్ణించడం తన ఉద్దేశమని రచయిత ఈ మొదటి చరణంలోనే సూచిస్తున్నాడు.

2. దేవుడు వెలుగునే బట్టలలాగ తొడుగుకొంటాడు. అనగా అతడు జ్యోతిర్మయుడని భావం. అతడు ఆకాశాన్ని అర్ధచంద్రాకృతిలో, గుడారంలాగా నిర్మించాడు.

3. హీబ్రూ ప్రజల భావాలప్రకారం ఆకాశానికి పైన జలరాసులుంటాయి. అవి ఉపరిజలాలు. భూమికి క్రిందా జలాలుంటాయి. అవి అంతర్జాలాలు. మొదట ఆకాశముంది. దాని విూద ఉపరిజలాలున్నాయి. ఆ జలరాశికి పైన దేవుడు తన నివాస స్థానాన్ని నిర్మించుకొన్నాడు. అతడు మేఘరథాల నెక్కుతాడు. వాయువులనే రెక్కల గుర్రాలమిూద స్వారి చేస్తాడు.

4. తుఫానులూ మెరపులూ అతనికి సేవలు చేసే బంటులు.

5. ప్రభువు క్రింది అంతర్జాలాలోనికి స్తంభాలు పాతి వాటిమిూద భూమిని నిర్మించాడు. ఆ నేల గట్టి పునాదుల విూద నిల్చిన యిల్లలాగ కదలకుండా ఉంటుంది.

6. ప్రాచీనకాలం నుండి నేల ఉంది. ఆదిమ జలాలు దాన్నిబట్టలా కప్పివున్నాయి.

7. దేవుడు నేలనుండి నీటిని వేరుపరచాడు. అదే సృష్టి జలాలు దేవుని ఆజ్ఞకు భయపడి తామూవరించియున్న నేలను వదలి దూరంగా పారిపోయాయి.

8. ప్రభువు నీళ్ళకు నిర్ణయించిన స్థలం సముద్రం. కనుక భూమిని మంచివున్న నీళ్ళు సాగరంలోకి చేరుకొన్నాయి.

9. ప్రభువు నీళ్ళకు చెలియలికట్టను పెట్టాడు. అవి ఆ హద్దు దాటిరావు. మళ్లా నేలను మంచివేయవు.

2–9 చరణాలు దేవుడు భూమిని శాసించేవాడని చెస్తాయి. మనమూ దేవుణ్ణి చూచి విస్తుపోవాలని భావం.

10. భూమ్యాకాశాలను వర్ణించాక, నేలమిది ప్రాణులను గూర్చి చెప్తున్నాడు. ఈ పదవ చరణం పేర్కొనే ఊటలు అంతర్జలాలనుండి ఏర్పడినవి.

11. పాలస్తీనా దేశంలోని ప్రధాన నదియైన యోర్గాను లోయల్లోను దట్టమైన అడవుల్లోను పారుతుంది. దాని తీరంలో వన్యమృగాలు వసిస్తుంటాయి.

12. ఈ రచయిత ప్రకృతితో సన్నిహితమైన పరిచయం కలవాడని చెప్పాం అతడు పక్షుల గూళ్ళను జాగ్రత్తగా పరిశీలించాడు. వాటి పాటలను శ్రద్ధగా విన్నాడు. 17వ చరణంలో కూడ ఈ భావాన్ని మళ్ళా చెప్పాడు.