పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34 నా యీ యాలోచనలు ప్రభువునకు ప్రియమగును గాక
నేను ప్రభువునం దానందించెదను
35 దుష్టులు భూమిమిదినుండి తొలగిపోవుదురుగాక
దుర్మారులు కంటికి కన్పింపకుండ బోవుదురుగాక
ఆత్మమా! ప్రభువును సన్నుతింపుము
విూరెల్లరును ప్రభువును స్తుతింపుడు.

1. పరిచయం

ఇది స్తుతి కీర్తనల వర్గానికి చెందింది. ఈ గేయం ప్రకృతి సౌందర్యంలో గోచరించే దేవుని మహిమలను వర్ణిస్తుంది. రచయిత ఆదికాండం తొలి రెండధ్యాయాల్లో కన్పించే సృష్టిక్రమాన్ని కొంతవరకు అనుసరించాడు. అతని భావాల ప్రకారం, భూమిమిూదా సముద్రంలోను ఉన్నప్రాణులన్నిటినీ దేవుడే చేసాడు. ప్రతి ప్రాణీ అతనిమిూద ఆధారపడి జీవిస్తుంది. ప్రకృతి దేవుని మహిమనూ అతని ప్రాణిపోషణ చాతుర్యాన్నీ వెల్లడిస్తుంది. ఈ రచయితకు ప్రకృతితో సన్నిహితమైన పరిచయం ఉంది. అతడు గూళ్లు కట్టే పక్షులు, కొండల్లో దాగివుండే కుందేళ్ళు మొదలైన అల్పప్రాణులను గూడ జాగ్రత్తగా పరిశీలించి చూచాడు. ప్రకృతి అంటే అతనికి యెంతో యిష్టం. ప్రాచీన మానవులు ప్రకృతియందంతటా దేవుణ్ణి దర్శించారు. ఈకీర్తనకారుడూ ఈలాంటివాడే. ఇతడు మంచికవి. పసిబిడ్డ హృదయంలాంటి యెడద కలవాడు, ఈగీతం మనం ప్రకృతి ඕපලස්තූපඒ దేవుణ్ణి దర్శించి అతన్నిస్తుతించి కీర్తించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. విశేషంగా ప్రకృతి ప్రియలు దీన్ని శ్రద్ధతో మననం చేసికోవాలి.

2. విభజనం

1 కీర్తన ఉద్దేశం దేవుణ్ణి స్తుతించడం
2–4 ఆకాశ వర్ణనం
5–9 భూమి వర్ణనం
10-18 నేలమీది ప్రాణులు
19–24 సూర్యచంద్రులు
25-26 సముద్రం
27-30 దేవుడు తిండిపెట్టి జీవకోటి ప్రాణాలు నిల్పుతాడు.
81–35 సృష్టికర్తకు స్తుతి.