పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. పరిచయం

యిస్రాయేలీయులు పెద్ద కుటుంబాన్ని దేవుని దీవెనగా భావించేవాళ్లు, ఈ కీర్తనలో రచయిత కుటుంబ జీవితాన్నీ దానివల్ల కలిగే ఆనందాన్నీ వర్ణించాడు. భక్తిమంతుడైన గృహస్థ దేవుణ్ణి పూజించుకొంటూ భార్యాసుతులతో సంతోషంగా కాలం గడుపుతాడు. అతడు పండు ముసలితనం దాకా జీవిస్తాడు. మనుమలను మదిమనుమలనుగూడ చూస్తాడు. యెరూషలేము మూడుపూవులు ఆరుకాయలుగా వృద్ధిజెందడం గూడ చూచి సంతృప్తి చెందుతాడు. యాతనలతోగూడిన సంసార జీవితం గడిపేవాళ్ళకు ఈ కీర్తన ఎంతో ఆనందాన్నీ ఓదార్పునీ కలిగిస్తుంది.

2. వివరణం

1.భక్తిగల యుస్రాయేలీయుడు దేవునికి భయపడతాడు. అతనిపట్ల వినయవిధేయతలు ప్రదర్శిస్తాడు. ఇంకా దేవుని మార్గాలలో నడుస్తాడు. అనగా దేవుని ఆజ్ఞలను పాటిస్తాడు.

2. దుర్మారులు అకాలమృత్యువు వాతబడతారు. వాళ్ల కష్ణార్జితాన్ని మరొకరు అనుభవిస్తారు. కాని పుణ్యపురుషుడు తన కష్టార్జితాన్ని తానే అనుభవిస్తాడు. అతనికి ఆనందమూ, విజయమూ, సంతానలాభమూ కలుగుతాయి. ఈ సంతానాన్నిగూర్చి తర్వాతి చరణంలో విపులంగా జెపున్నాడు. 3. పుణ్యపురుషుని ఇల్లాలిని ద్రాక్షతీగతో పోల్చాడు. ఆ తీగ ఏటేట చాల పండ్లు కాస్తుంది. అలాగే ఆయిల్లాలు చాలమంది బిడ్డలను కంటుంది.

అతని బిడ్డలను ఓలివు మొక్కలతో పోల్చాడు. ఓలివు చెట్టు చాల పిలకలు వేస్తుంది - మన అరటిచెట్టులాగ కొన్నియేండ్లయ్యాక మొదటిచెట్టు నశిస్తుంది. అప్పుడుదాని పిలకలు చెట్లవుతాయి. అలాగే తండ్రి గతించాక బిడ్డలు అతని జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ తండ్రిచుటూ, భోజనపు బల్లచుటూ గుమిగూడిన పిల్లలు ఓలివు చెట్టచుటూ మొల్చిన పిలకలాగున్నారని ఉపమానం. ద్రాక్షలూ, ఓలివులూ ప్రభువు యిస్రాయేలీయుల కిచ్చినవరాలు. ఇక్కడ భార్యనూ బిడ్డలనూ ఈ చెట్లతో పోల్చడం ఎంతో హృద్యంగా

4. పుణ్యాత్మునికి సిద్ధించే దీవెనలు ఆనందం, విజయం, భార్యాసుతులూ, అతనికి ఇంకేమి కావాలి?

5-6. యెరూషలేం దేవళంలో నుండి ప్రభువు తన భక్తులను దీవిస్తాడు.