పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15 నేను రహస్య స్థలమున రూపము దాల్చినపుడు,
    మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడవైనపుడు
    నీ కంటికి మరుగై యుండలేదు
16 నేను పిండముగా నున్నపుడే నీవు నన్ను చూచితివి
    నాకు నిర్ణయింపబడిన దినములన్నియు-
    అవి యింకను ప్రారంభము కాకమునుపే
    నీ గ్రంథమున లిఖింపబడియున్నవి
17 దేవా! నీ యూలోచనలను గ్రహించుట యెంత కష్టము!
    వాని సంఖ్య అపారమైనది కదా!
18 నేను నీ యాలోచనలను లెక్కింప బూనినచో
    అవి యిసుకరేణువులకంటె నెక్కువగా నుండును
    నేను మేల్కొనినపుడు ఇంకను నీ చెంతనే యందును

4


19 దేవా! నీవు దుషులను సంహరించిన నెంతబాగుండును!
    దౌర్జన్యపరులు నా జోలికి రాకున్న నెంతబాగుండును!
20 వారు నిన్నుగూర్చి చెడ్డగా మాటలాడుచున్నారు
    నీ నామమును దూషించుచున్నారు
21 ప్రభూ! నిన్ను ద్వేషించువారిని నేను ద్వేషించుటలేదా!
    నీ మీద తిరుగుబడువారిని నే నసహ్యించుకొనుటలేదా?
22 నేను వారిని పూర్ణముగా ద్వేషింతును
    వారిని నా సొంత శత్రువులనుగా భావింతును
23 దేవా నన్ను పరిశీలించి నా హృదయమును తెలిసికొనుము
    నన్ను పరీక్షించి నా యాలోచనలను గుర్తింపుము
24 నాలో చెడ్డ యేమైన నున్నదేమో చూడుము
    శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము.

1. పరిచయం

ఈ గీతం జ్ఞానకీర్తనల వర్గానికి చెందింది. ఇది దైవసాన్నిధ్యాన్ని కన్నులకు గట్టినట్లుగా వర్ణిస్తుంది. మనం నిరంతరం దేవుని సన్నిధిలోనే ఉంటామని చెప్తుంది. ఈ గీతం మన జ్ఞానోపదేశ గ్రంథాల్లాగ దేవుడు అలాంటివాడు ఈలాంటివాడు అని చెప్పదు.