పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరోక్షంగా అతని గుణగణాలను పేర్కొనదు. నీవూ నేను అన్న పక్కిలో దేవునితో ప్రత్యక్షంగా సంభాషిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ గేయంలో కీర్తనకారుడు భగవంతునిసాన్నిధ్యంపట్ల తనకున్న వ్యక్తిగతానుభవాలను వర్ణించాడు. అతనిమీద ఏవో నేరాలు వచ్చాయి. బహుశః అతడు విగ్రహారాధకుడని శత్రువులు అతనిమీద నిందలు మోపి ఉంటారు. కనుక అతడు నేను నిజంగా దోషినేమో పరిశీలించి చూడమని దేవునికి మొరపెట్టుకొన్నాడు.

ఈ రచయితకు గొప్పదైవానుభూతి ఉంది. దేవుని లక్షణాలను అర్థం జేసికొనేశక్తి ఉంది. ఈ లక్షణాలను భావితరాలవారి కొరకు స్పష్టంగా వివరించి చెప్పగలిగే శక్తికూడ ఉంది. ఇవి అరుదైన వరాలు.

ఇది బైబుల్లోని గొప్ప కీర్తనల్లో వొకటి. కనుక భక్తులు దీనితో బాగా పరిచయం కలిగించుకొని దీన్ని తరచుగా ప్రార్థనలో వాడుకొంటూండాలి. దైవసాన్నిధ్యాన్ని గుర్తించడం మన భక్తిలో ఉన్నత శిఖరంలాంటిది.

2. విభజనం

1-6 భగవంతుడు సర్వజ్ఞాని
7-12 అతడు అంతటా ఉంటాడు
13-16 అతడు అన్నీ చేయగలడు
17-18 మనం అతన్ని అర్థం చేసికోలేం
19–22 దుషులు నాశమైపోవాలని ప్రార్ధన
23-24 తన్ను పరీక్షించి చూడమని దేవునికి ప్రార్థన.

3. వివరణం

ఈ కీర్తనలో ఆరేసి చరణాలతో గూడిన నాలు భాగాలున్నాయి. మొదటి భాగంలో దేవుడు సర్వజ్ఞాని అని చెప్తున్నాడు.

1. దేవునికి భక్తుని మాటలూ తలపులూ చేతలూ అన్నీ తెలుసు.
2. కూర్చుండడమంటే రాత్రి పనిని విరమించడం. లేవడం అంటే ఉదయం పని ప్రారంభించడం. అనగా నా కార్యాలన్నీ నీకు తెలుసు అని భావం, దూరం నుండి అంటే స్వర్గం నుండే దేవుడు అతని ఆలోచనలను గుర్తిస్తాడని అర్థం.
3. నడవడం, పరుండడం అన్నాకూడ నాపనులన్నీయని అర్థం
5. శత్రుసైన్యం కోటనులాగ, ప్రభువు కీర్తనకారుని అన్నివైపుల నుండి చుట్టుముట్టి ఉంటూడ.
6. మనలనుగూర్చి దేవునికున్న జ్ఞానం ఆశ్చర్యకరమైనది. అది మనకు సరిగా అర్థంకాదుగూడ.