పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


4 నా నోట మాట రాకమునుపే
  నేనేమి చెప్పదునో నీవెరుగుదువు

5 ముందువెనుకల నీవు నన్ను చుట్టుముట్టియందువు
  నీచేతిని నామీద నిల్పియంతువు

6 నన్నుగూర్చిన నీ తెలివిడి అత్యద్భుతమైనది
  అది చాల యున్నతమైనది, నా బుద్ధి కందనిది

27 నేను నిన్ను తప్పించుకొని యొక్కడికి పోగలను?
  నీ సమక్షమునుండి యెచ్చటికి పారిపోగలను?

8 నేను గగనమున కెక్కిపోయినచో నీవచట నుందువు
  పాతాళమున పరుండియున్నచో నచట నుందువు

9 నేను రెక్కలు కట్టుకొని తూర్పున కెగిరిపోయినను
  పడమరన చాల దూరమున వసించినను

10 నీ వచటను నీ చేతితో నన్ను నడిపింతువు
   నీ కుడిచేతిలో నన్నాదుకొందువు

11 నేను చీకటి నన్ను కప్పివేయవలెననియు
   నా చుట్టనున్న వెలుతురు చీకటిగా మారవలెననియు కోరుకొన్నను

12 చీకటి నీకు చీకటి కాజాలదు
   నీ ముందట చీకటి పగటివలె ప్రకాశించును
   రేయింబవళ్ళు నీకు సరిసమానము

313 నాలోని ప్రత్యణువును నీవే సృజించితివి
   మాతృగర్భమున నన్ను రూపొందించితివి

14 నీవు భీకరుడవు కనుక నేను నీకు వందనము లర్పింతును
   నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
   ఈ యంశము నాకు బాగుగా తెలియును