పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదలైన నైతికాంశాలను ప్రస్తావిస్తాయి. 1, 119, 127 - 128, 133, 139 మొదలైనవి ఈ వర్గానికి చెందిన కీర్తనలు. హిబ్రూ రచయితలు కీర్తనల నన్నింటినీ పద్యాలుగా వ్రాసారు. ఈ మొదటి కీర్తనం వొక్కటే వచనంలో వుంది.

ఈ కీర్తనం కీర్తనల గ్రంథంలోని నైతిక బోధలన్నిటికీ పరిచయ ప్రాయంగా ఉంటుంది. కనుకనే కీర్తనల గ్రంథానికి దీన్ని ప్రారంభ కీర్తనగా అమర్చారు.

ఈ కీర్తనం సజ్జనుల మార్గం, దుర్జనుల మార్గం అని రెండు త్రోవలను పేర్కొంటుంది. బుద్ధిమంతులు సజ్జనుల మార్గంలో నడవాలని సూచిస్తుంది. ఈ రెండు త్రోవల లక్షణాలు ఇవి.

సజ్జనుల మార్గం - దుర్జనుల మార్గం

ధర్మశాస్త్ర పారాయణం - ధర్మశాస్త్ర అనాదరణం

పండు పండే చెట్టులాంటిది - గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటిది

ప్రభువు ఈ త్రోవను ఆదరిస్తాడు - ఇది నాశమౌతుంది

ఇది జీవనదాయకం - ఇది వినాశప్రదం

ఈ కీర్తనలో "త్రోవ" అంటే జీవితవిధానం.

2. విభజనం

ఈ కీర్తనలోని భావాలనుబట్టి దీని చరణాలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు

1-3 జీవన మార్గం

4-5 వినాశ మార్గం

6 ఇరు త్రోవలు విడిపోవడం.

3. వివరణం

చరణం 1. ఈ మొదటి చరణం సజ్జనులు ఏయే దుష్కార్యాలు చేయరో చెప్తుంది. వాళ్ళ దుషుల సలహాలు పాటించరు. దుర్మార్డుల దుష్కార్యాల్లో పాల్గొనరు. ప్రభుని వేళాకోళం చేసేవాళ్ళ ముఠాలో చేరరు. యిప్రాయేలు ప్రజల్లో నాస్తికులు లేరు. అంతా దేవుణ్ణి అంగీకరించారు. కాని వాళ్ళల్లో కొందరు ఆరాధన మొదలైన దైవసంబంధకార్యాలను చిన్నచూపు చూచి వేళాకోళం చేసారు. సజ్జనులు ఈలాంటి వాళ్ళతో కలవరు.

2. ఈ రెండవ చరణం సజ్జనులుచేసే సత్కార్యాలను పేర్కొంటుంది. వాళ్లు మోషే ధర్మశాస్తాన్ని ఆనందంతో పఠిస్తారు. ఇక్కడ ధర్మశాస్త్రమంటే పూర్వవేదమంతా గూడాను, ఇది దైవచిత్తాన్నితెలియజేస్తుంది. భక్తులకు నిత్యజీవితంలో దారి జూపుతుంది.