పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అటుపిమ్మట, ఇతివృత్తాన్ని ಬట్టి వాటిని చాల రకాలుగా విభజించారు. 1. Wisdom Psalms- జ్ఞానకీర్తనలు 2. Confidence Fsalms-విశ్వాస కీర్తనలు 3. Pilgrim Psalms - యాత్రిక కీర్తనలు 4. Royal Palms - రాజ కీర్తనలు 5. Messianic మెస్సీయాకీర్తనలు 6. Prophetic Psalms - ప్రవచనాత్మక కీర్తనలు మొ. ఈ వర్గాల కీర్తనలన్నీ ఈ పుస్తకంలో వస్తాయి.

కీర్తన -1

రెండు త్రోవలు

1. దుష్టుల సలహాలను పాటింపనివాడును దుర్మారుల దుష్కార్యములలో పాల్గొననివాడును ప్రభుని వేళాకోళముచేయువారితో చేతులు కలపనివాడును ఐన నరుడు ధన్యుడు

2. అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవళ్లు మననము చేసికొనుచుండును

3. అతడు ఏటియొడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడకయుండు చెట్టువంటివాడు - అతడు తాను చేపట్టిన కార్యములన్నిటను విజయము బడయును.

4. కాని దుర్మార్లు లిట్టివారు కారు వారు కళ్లమున గాలి కెగిరిపోవు పొట్టువంటివారు.

5. దుష్టులు దేవుని తీర్పునకు తట్టుకొని నిలువజాలరు పుణ్యపురుషుల బృందమున చేరజాలరు.

6. సాధుపురుషుల మార్గమును ప్రభు వాదరించును దుష్టుల మార్గము నాశమునకు గురియగును.

1. పరిచయం

కొన్నికీర్తనలకు జ్ఞానకీర్తనలని పేరు. ఈ మొదటి కీర్తన జ్ఞానవర్గానకి చెందింది. ఈ రకం కీర్తనలు జ్ఞానం, దైవభీతి, ధర్మశాస్త్రం, పాపం పుణ్యం, దైవశిక్ష దేవుని దీవెన