పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/232

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధర్మగ్రంధాన్ని చదువుకొని దైవచిత్తాన్ని తెలిసికొని దాన్ని నిత్యజీవితంలో పాటించడాన్నే యూదులు ప్రధాన భక్తిగా ఎంచేవాళ్లు. భక్తులు నిర్బంధానికి గురైగాక స్వేచ్చగాను ఆనందంతోను పవిత్రగ్రంథాన్ని చదువుకొన్నారు. అది వాళ్ళకు భారం కాలేదు, సంతోషదాయకమైంది. పూర్వులు వేదగ్రంథాలను కంఠతః నేర్చుకొనేవాళ్లు వాటి వాక్యాలను మెల్లని స్వరంతో నోటితో ఉచ్చరిస్తూ ధ్యానం చేసికొనేవాళ్లు, ఈ యభ్యాసాన్నే ఈ కీర్తనం “మననం" అని పేర్కొంటుంది.

3. మామూలుగా బెట్టవలనా, అప్పుడప్పుడు తోలే 'షిరాక్రో? అనే వేడిగాలివలనా పాలస్తీనా దేశంలో చెట్ల వాడిపోయేవి. కాని ఏటి యొుడునా కాల్వల గట్టనా పెరిగే చెట్ల ఆలా వాడిపోక ఋతువరాగానే పండ్లు కాస్తుండేవి. సజ్జనులు కూడ ఈ చెట్లలా ఫలిస్తారు. చెట్టు నీటివలన ఫలిస్తుంది. సత్పురుషులు ధర్మశాస్త్ర పారాయణం వలన సిద్ధించే వరప్రసాదంద్వారా ఫలిస్తారు. సజ్జనులు చేసే సత్కార్యాలే వాళ్ళ ఫలించే ఫలాలు - మత్త 7, 16-18.

ధర్మశాస్త్ర మననంద్వారా దేవునితో ఐక్యమై దైవబలాన్ని పొందుతూంటారుగాన, సజ్జనులు తాము చేపట్టిన కార్యాలన్నిటిలోను విజయాన్ని సాధిస్తారు.

4. కవి మొదటి మూడు చరణాల్లోను సజ్జనులమార్గాన్ని వర్ణించాడు. ఇక దుర్జనుల మార్గాన్ని గూర్చి చెప్తున్నాడు. దుర్మార్డులు సన్మార్డుల్లాగ విజయాలు సాధించరు. కళ్ళంలోని పొట్టులాగ ఎగిరిపోతారు. కళ్ళంలో గింజలను తూర్పారబట్టినపుడు ధాన్యం అక్కడే పడుతుంది. తాలు, పొట్టు గాలికి ఎగిరిపోయి దూరంగా పడతాయి. దుషులు ఈ పొట్టులాగ కొట్టుకొని పోతారు. మంచివాళ్ళు మాత్రం గట్టి ధాన్యంలాగ నిలుస్తారు.

5. ఈ చరణం పేర్కొనే దేవుని తీర్పు మనం చనిపోయాక పరలోకంలో జరిగేదికాదు. మనం బ్రతికి వుండగానే, ఈ లోకంలోనే, జరిగేది. దేవుడు ప్రతినిత్యమూ మనమంచి చెడ్డలను ఎంచుతూనే ఉంటాడు, మనకు తీర్పు తీరుస్తూనే ఉంటాడు - మత్త 3,12. ఈ తీర్పులో మంచివాళ్ళ దేవుని ముందు నిలబడగల్లుతారు. కాని దుర్మార్డులు అతని ముందు నిలువలేరు. ప్రభువు వాళ్ళ దుష్కార్యాలకు వాళ్ళను ఖండిస్తాడు. తన సన్నిధి నుండి గెంటివేస్తాడు.

ఇంకా, మంచివాళ్లు దేవాలయంలో గుమికూడిన పుణ్యపురుషుల బృందంలోచేరి దేవుణ్ణి స్తుతిస్తారు. కాని దుర్మారులు ఈ భక్త బృందంలో చేరలేరు, దేవుణ్ణి అరాధించలేరు. వాళ్ళకు ఆ భాగ్యం అబ్బదు.

6. మంచిమార్గంలోపోయే సాధుపురుషులను దేవుడు ఆదరిస్తాడు. వాళ్ళకుప్రభువు దీవెనలు లభిస్తాయి. చెడ్డ మార్గంలో పోయే దుష్టులను దేవుడు నాశం చేస్తాడు.