పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ తండ్రి యిప్పడు శ్రీసభ పరిచర్యద్వారా నీకు పాపపరిహారాన్నీశాంతినీ దయచేయునుగాక. పిత పత్ర పవిత్రాత్మల పేరుమిూదుగా నేను నీ పాపాలను మన్నిస్తున్నాను."

భక్తులు ఈ ప్రార్థనను భక్తితో ధ్యానం చేసికోవాలి. దీనిలో చాల భావాలున్నాయి. 1. పాపవిమోచనమనేది కరుణాళువైన తండ్రి అనుగ్రహించే వరం. అతడు మన తప్పలను మన్నించి మనలను మళ్లా తన బిడ్డలనుగా జేసికొంటాడు. 2. క్రీస్తు మరణోత్తానాల ద్వారా మనకు పాపవిమోచనం కలుగుతుంది. మన పాపాలకు పరిహారం చేసే రక్షకుడు అతడే. 3. ఆత్మద్వారాగూడ మనకు పాపపరిహారం కలుగుతుంది. మనహృదయంలో పశ్చాత్తాపం పుట్టించేదీ, మనం దేవునినుండి మన్నింపు పొందేలా చేసేదీ ఆ పవిత్రాత్ముడే మనలను దేవునితోను తోడి ప్రజలతోను సమాధాన పరిచేదికూడ అతడే. ఈలా పాపోచ్చారణంలో ముగ్గురు దైవవ్యక్తులూ మన హృదయంలో పనిచేస్తారు. 4. ఇక, మనకు ఈ పాపపరిహారం శ్రీసభ ద్వారా లభిస్తుంది. మన పాపాలద్వారా మనం శ్రీసభను అనాగా క్ర్తెస్తవ సమాజాన్ని బాధిస్తాం. ఇప్పడు శ్రీసభ తన ప్రతినిధియైన గురువు ద్వారా మనకు మన్నింపు దయచేస్తుంది. పాపంలో సామూహిక గుణం వుంటుందని ముందే చెప్పాం. 5. ఈ పాపపరిహారం మనకొక్కరికే కాదు, లోకానికంతటికీ కూడ. తండ్రి క్రీస్తుద్వారా లోకాన్నంతటినీ తనతో సమాధానపరచుకొన్నాడు. ఈ పాపోచ్చారణంలో మనం మన్నింపుపొందితే దానివలన లోకానికి కూడ కొంతవరకు సమాధానం కలుగుతుంది. ఒకవ్యక్తి పశ్చాత్తాపం లోకానికంతటికీ మేలు చేకూర్చిపెడుతుంది ఈ "లోకసమాధానం" అనేది కేవలం మనుష్యలోకానికేగాక సకల సృష్టికీ వర్తిస్తుంది. 6. కడన, పాపోచ్చారణ ఫలితం శాంతి. మెస్సియా కొనివచ్చే భౌతిక, ఆధ్యాత్మిక భాగ్యాలన్నిటినీ కలిపి బైబులు "షలోం" అని పిలుస్తుంది. అదే శాంతి. ఇక్కడ మనం ఈ పాపోచ్చారణ ద్వారా దేవునితోను తోడి ప్రజలతోను సమాధానపడ్డంవల్ల మనకు ఈ శాంతి లభిస్తుంది.

ప్రస్తుత విధిలో గురువు మన్నింపు ప్రార్థనను చెప్పేపుడు భక్తుని తలమిూద చేయి చాస్తారు. బైబులు సంప్రదాయం ప్రకారం చేతులు చాచడమనే సంజ్ఞ దేవుని దీవెనను పొందడానికి చిహ్నంగా వుంటుంది. విశేషంగా ఈ సంజ్ఞ ఆత్మను పొందడానికి గుర్తు, ఈ సంస్కారంలో ఆత్మడు మన హృదయంలోకి ప్రవేశించి మన పాపాలు మన్నిస్తాడు. కనుక ఇక్కడ గురువు ఈలా చేయి చాచడం అర్థయుక్తమైన సంజ్ఞ.

6. కృతజ్ఞతా వందనం, వీడ్కోలు

గురువునుండి మన్నింపు పొందినపిమ్మట భక్తుడు దేవుని కరుణను స్తుతించాలి. అతడు ఈ స్తుతిని వేదవాక్యాల్లోనే వెలిబుచ్చడం మంచిది. ఈ సందర్భానికి తగిన