పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నష్టపరిహారం చెల్లించమని విశ్వాసికి తెలియజేస్తారు. తరువాత గురువు విశ్వాసికి ప్రాయశ్చిత్తం విధిస్తారు. ఇది ప్రార్ధనగా గాని, ఉపవాసంగాగాని, దానంగాగాని సేవగాగాని వుండవచ్చు. ఈ చివరిరకం అపరాధం పాపంలో వుండే సామూహిక గుణాన్నిసూచిస్తుంది.

పశ్చాత్తాప హృదయుడు తాను మొదట చదివిన బైబులు వాక్యాలనుండే ప్రేరణంపొంది పాపాలను చెప్పకొంటే బాగుంటుంది. గురువు యిచ్చే సలహాగాని అపరాధంగాని భక్తుని అవసరాలకు తగినట్లుగా వుంటే మంచి ఫలితమిస్తుంది. ఈనాడు అందరిలోను సామాజికస్పృహ పెరిగిపోయింది. విశేషంగా పేదసాదలకు అన్యాయాలు జరగడాన్ని అందరూ గర్షిస్తూన్నారు. కనుక ఈ కాలంలో గురువు తోడిప్రజలకు సేవచేయమనీ కరుణకార్యాలు చేపట్టమనీ విశ్వాసులకు అపరాధం విధిస్తే బాగుంటుంది.

4. భక్తుని పశ్చాత్తాప ప్రార్ధన


గురువు ప్రాయశ్చిత్తాన్ని విధించిన తరువాత భక్తుడు ప్రభువు తన్ను మన్నించాలనీ, భవిష్యత్తులో క్రొత్తజీవితం జీవించడానికి తనకు తోడ్పడాలని ప్రార్ధిస్తాడు. అతడు బైబులు వాక్యాలనే పశ్చాత్తాప ప్రార్థనగా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఈ క్రింది జపాలు ఉపకరిస్తాయి.
ప్రభూ! నా దోషాలనుండి నన్ను శుద్ధిచేయి
నా పాపాన్ని కడుగు
నేను నా తప్పిదాన్ని ఒప్పకొంటున్నాను
నా పాపం నిత్యం నా యెదుట కన్పిస్తూనే వుంది"
కీర్త 51.2-3. ఇంకా "ప్రభూ! నీవు పాపాత్ములకు స్నేహితుడవు అని పిలిపించుకోగోరావు. రక్షణనొసగే నీ మరణిశోత్తానాల ద్వారా నా పాపాలనుండి నన్ను శుద్ధిచేయి" అని ప్రార్జించవచ్చు. ఈలా మనకు నచ్చిన బైబులు వాక్యాలను వేటినైనా ప్రార్ధనగా మల్చుకోవచ్చు.
 

5. మన్నింపు ప్రార్ధనం


తరువాత గురువు భక్తుని విూదికి చేయిచాచి, అతని పాపాలకు క్షమాపణాన్ని దయచేసే మన్నింపు ప్రార్థనను జపిస్తారు. ప్రస్తుత నూత్న విధిలో ఈ ప్రార్ధనం ఈలా వుంటుంది. "కరుణామయుడైన తండ్రి తన కుమారుని మరణోత్థానాల ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకొన్నాడు. పాపపరిహారానికి నరులమిద పవిత్రాత్మను కుమ్మరించాడు.