పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సంఖ్యను గూర్చి తల బ్రద్దలు చేసికోనక్కరలేదు. దేవుడు కరుణామయుడు. అతనికి మన హృదయం తెలుసు. పైగా నేడు కొందరు వేదశాస్త్రులు పాపం ఒక క్రియగాదు, ఒక దశ అని చెప్తున్నారు. మనం ఏ పాపం ఎన్నిసార్లు చేసామని ఆలోచించడంకంటె పాపదశలో వున్నామని అర్థంచేసికోవడం ముఖ్యమని బోధిస్తున్నారు.

మన పాపాన్ని ఘనమైన దాన్నిగా మార్చే పరిస్థితులు కూడా వుంటాయి. ఉదాహరణకు మామూలు దొంగతనం వేరు, గుడిసొమ్ము దొంగిలించడం వేరు. గుడిసొమ్ము దొంగిలించినపుడు దేవద్రోహమనే పాపాన్ని అధికంగా కట్టుకొంటాం. పెండ్లి కాని వ్యక్తితో కంటె పెండ్లయిన వ్యక్తితో పాపం చేయడం పెద్ద తప్పు. ఈలా మన పాపాన్ని ఘనమైనదాన్నిగా మార్చే సందర్భాలున్నాయి. వాటిని పాపోచ్చారణంలో తెలియజేయాలి. ఐనా ఇక్కడ కూడ మనం ఆందోళనం చెందకూడదు. గురువు నెదుట తన పాపాలను చెప్పేపుడు వ్యక్తి తన బలహీనతలను దాచిపెట్టుకోకుండా వుంటే చాలు.

కొందరు తమ బాల్యపాపాలనుగూర్చి కలవరపడుతూంటారు. అవి యిప్పడు గుర్తుకురావడం లేదనీ, వాటిని దేవుడు మన్నించాడో లేదోననీ ఆందోళనం చెందుతూంటారు. బాల్యంలో ఏది పాపమో ఏది కాదో మనకు అంత రూఢిగా తెలియదు. పాపమని తెలియక చేసిన క్రియ పాపం కాదు. కనుక బాల్యపాపాల్లో చాలా అసలు పాపాలేకావు. మనం పాపమని తెలియక ఓ చెడ్డపని చేస్తాం. తర్వాత మనకు జ్ఞానం పెరిగి మతవిషయాలను క్షుణ్ణంగా నేర్చుకొన్న పిదప పూర్వం మనం చేసిన ఆ చెడ్డపని పాపమే గదా అన్పిస్తుంది. ఐనా ఆ చెడ్డపని చేసినపుడు అది పాపమని మనకు తెలియదు కనుక, అది పాపం కాజాలదు.

ఫలితాంశ మేమిటంటే, పాపాలను చెప్పకొనే వ్యక్తి గురువు నెదుట తన హృదయాన్ని విప్పితే చాలు. దేవుని కరుణమిూద ఆధారపడితే చాలు, అతడు మన్నింపు పొందుతాడు.

4. భక్తి కొరకు పాపోచ్చారణం

పాపోచ్చారణం ఆవశ్యకమైంది, భక్తికొరకు చేసేది అని రెండు రకాలుగా వుంటుంది. చావైన పాపాలను పోగొట్టుకోవడానికి చేసే పాపోచ్చారణం ఆవశ్యకమైంది. ఇది లేకపోతే పాపక్షమాపణం లేదు. కేవలం స్వల్ప పాపాలను మాత్రమే పోగొట్టుకోవడానికి చేసే పాప్పొచ్చారణం భక్తికొరకు చేసేది. దీన్ని చేయకపోయినా ఆ స్వల్పపాపాలకు మన్నింపు పొందవచ్చు. ఎందుకంటే, పశ్చాత్తాపం ఉపవాసం దానం జపం మొదలైనవి కూడ మన స్వల్పపాపాలను మన్నిస్తాయి. ఐనా ఈ స్వల్పపాపాల కొరకు గూడ పాపోచ్చారణం చేయడం