పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మంచిదే. ఎందుకు? జ్ఞానస్నానాన్ని పుచ్చుకోవడం వలన మనం శారీరక వ్యామోహాలను జయించి పరిశుద్ధ జీవితం జీవించవలసిన బాధ్యత వుంది. ఈ బాధ్యతను తీర్చుకోవడానికి పాపోచ్చారణం ఉపయోగపడుతుంది. దీనివల్ల మనం అల్పపాపాలను గూడ తొలగించుకొని మరింత పరిశుద్దులమౌతాం. ఈ సంస్కారం ద్వారా క్రీస్తు మరణం మన మిద సోకి మనలను మరింతగా శుద్ధి చేస్తుంది. మనలోని స్వార్థం క్రమేణ అంతరిస్తుంది. కేవలం మన ప్రయత్నంవల్లనే మనం పునీతులం కాలేము, సంస్కారాలు ప్రసాదించే వరప్రసాదం వల్ల పవిత్రులమౌతామని అర్థం చేసికొంటాం. ఈ పాపోచ్చారణం ద్వారా మన బలహీనతలు బాగా అనుభవానికి వచ్చి వినయం అలవడుతుంది. మన దురభ్యాసాలను సవరించుకోగలుతాం. మామూలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రదర్శించే పట్టీపట్టనితనాన్ని సవరించుకొంటాం. భావిజీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి వలసిన హితోపదేశాన్ని పొందుతాం. వరప్రసాద సమృద్ధి కల్గుతుంది. ఇన్ని మంచి ఫలితాలున్నాయి కనుకనే ఈ పాపోచ్చారణం అవస్యం పాటింపదగింది.

మనం అధికంగా పవిత్రులమయ్యేకొలదీ మన పాపాలు కూడ మనకు అధికంగానే తెలిసివస్తాయి. కనుక వాటిని ఎక్కువగా వదిలించుకోగోరుతాం. కావున పవిత్ర జీవితం విూద దృష్టికలవాళ్ళకి ఈ పాపోచ్చారణం ఎక్కువ అవసరమనిపిస్తుంది.

పాపోచ్చారణంలో మనం కేవలం స్వల్పపాపాల జాబితాలను ఏకరువు చాలదు. వాటికి ఆధారాలైన మూల పాపాలను - అనగా గర్వం స్వార్థం కమ0 సోమరితనం - మొదలైన వాటిని గూడ ఒప్పకోవాలి. ఒకమారు మనలోని మూలపాపాలను అంగీకరిస్తే ఇక మనం మంచికి మారడం మొదలుపెడతాం.

మామూలుగా మనం చేసిన చెడ్డపనులు మాత్రమే పాపాలనుకొంటాం. మనంచేయవలసిన మంచిపనులను చేయకుండా వదలివేస్తే అవికూడా పాపాలే ఔతాయి. ఉదాహరణకు మనకుండిగూడ తోడి బీదలకు సహాయం చేయకపోతే పాపం. మనం పేదలకు అన్యాయం చేసినపుడు మాత్రమే కాదు, వాళ్ళకు న్యాయం జరిగించకుండా మెదలకుండా వున్నపుడు గూడ తప్పే కనుక ఈలంటి పాపాలను గూడ గురువుతో చెప్పాలి.

కొందరు ఈ స్వల్పపాపాలతోపాటు పూర్వం పాపోచ్చారణంలో చెప్పి మన్నింపు పొందిన చావైన పాపాలు ఒకటి రెండు కూడా మళ్ళా చెపూంటారు. ఈ పద్ధతి మంచిదే. దీనివల్ల మనకు వినయమూ భక్తి పెరుగుతాయి. దేవుని కరుణను అధికంగా స్మరించుకొంటాం.

ఈ సందర్భంలోనే యావజ్జీవిత పాపోచ్చారణాన్ని గూర్చి కూడ ఒకటిరెండు మాటలు చెప్పాలి. ఇది చాలా భక్తిగల క్రియ. భక్తుడు ఇగ్నేష్యస్ లొయోలా తన తపోభ్యాసాల్లో