పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన పాపాలను కప్పిపెట్టుకొనే నరునుకి మనశ్శాంతి వుండదు. కుమ్మరి ఆవంలోని నిప్పులాగ పాపభారం లోలోపల గనగన మండుతుంటుంది. కాని ఓమారు నరుడు తన తప్పు బయటకి చెప్పకోగానే ఎంతో వుపశాంతి వూరటా చేకూరతాయి. దీనితో భక్తుని హృదయంలో దాగివున్న శక్తి వెలికివస్తుంది. వ్యక్తిగా అతడు పెరుగుతాడు. కనుక హృదయం విప్పడం ద్వారా గొప్ప మానసికారోగ్యం చేకూరుతుంది. అందుకే చాలామంది నిత్యజీవితంలో పాపోచ్చారణ పద్ధతిలో కాకపోయినా ఏదో రూపంలో ఎవరికో వొకరికి హృదయం విప్పుకొంటూంటారు.

ఇంకా పాపభీతివల్ల బాధపడేవాళ్ళకి ఆరోగ్యం చెడిపోవచ్చు. భయవిచారాదులు వాళ్ళను క్రుంగదీయవచ్చు. వాళ్ళు తోడిజనంతో వొద్దికగా జీవించలేకపోవచ్చు ఇతరులతో వ్యహరించేపుడు ఔను అనే మనస్తత్వంకంటె లేదు అనే మనస్తత్వాన్నే ఎక్కువగా ప్రదర్శించవచ్చు. ఆలాంటప్పుడు పాపోచ్చారణం ఈ యనిష్టగుణాలను చాలవరకు సవరించి వాళ్ళకు మానసికారోగ్యం చేకూర్చి పెడుతుంది.

మన పాపాలను తోడి నరుడైన గురువుతో చెప్పకోడానికి మనమేమి సిగ్గుపడనక్కరలేదు, అవమానానికి గురికానక్కరలేదు. అది మనలను కించపరిచే కార్యంకాదు. మనం స్వాతంత్ర్యంగల నరులం, బాధ్యత తెలిసినవాళ్ళం. కనుక మన తప్పు పనులకు పూర్తిగా మనమే బాధ్యులం. అలాంటప్పుడు మన తప్పలను మనం ఒప్పకొని పశ్చాత్తాపపడితే, తక్కువవాళ్ళం కాముగదా గొప్పవాళ్ళమే ఔతాం. కనుక మనం స్వేచ్ఛాపూర్వకంగానే తోడినరుని యెదుట మన పాపాలను ఒప్పుకోవచ్చు. ఆ తోడినరుడు కూడ మన దోషాలను తెలిసికొని మనలను చిన్నచూపు చూచేవాడుకాదు. అవహేళనం చేసేవాడూకాదు. అతడు దేవుని కరుణనూ అనుగ్రహాన్ని మనకు సంపాదించిపెట్టేవాడు. పాపోచ్చారణంలో గురువు మనలను అంగీకరిస్తాడు. కనుక మనమిద మనకే నమ్మకంపట్టి మనలను మనమే అంగీకరించుకొంటాం. మనలోని పాపశంకా, పాపభీతి తొలగిపోతాయి. ఇవన్నీ పాపోచ్చారణంవల్ల కలిగే మానసిక లాభాలు.

3. పాపోచ్చారణంలో తెలియజేయవలసిన అంశాలు

బ్రెంటు మహాసభ బోధల ప్రకారం మనం ఆత్మ శోధలు చేసికొన్నపుడు గుర్తుకివచ్చిన చావైన పాపాలన్నిటినీ సంఖ్యాపూర్వకంగా గురువుతో చెప్పాలి. ఇంకా ఆ పాపాలను ఘనమైన వాటినిగా గాని స్వల్పమైనవాటినిగా గాని మార్చే పరిస్థితులు ఏమైన వుంటే వాటిని గూడ గురువుకి తెలియజేయాలి.

మనకు గుర్తుకు వచ్చిన చావైన పాపాలను చెప్తేచాలు. గుర్తున్నంతవరకు వాటి సంఖ్యను గూడ - అనగ ఏ పెద్ద పాపాన్ని ఎన్నిసార్లు చేసింది - తెలియజేయాలి. ఐనా