పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. యూదులు మొదట యెడారిలోని గుడారంలోను తర్వాత యెరూషలేములోని దేవళంలోని దేవుని సన్నిధిలోను పండ్రెండు రొట్టెలు పెట్టేవాళ్ళు, వాటికి సాన్నిధ్యపు రొట్టెలు అని పేరు. ఇవి యిప్రాయేలు ప్రజల పండ్రెండు తెగలకు చిహ్నంగా వుండేవి. ఈ పండ్రెండు రొట్టెలను చూచి దేవుడు పండ్రెండు తెగల ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొంటాడని వాళ్ళ భావం - లేవీ 24,5-9.

4. "పుణ్యపురుషుడు సమర్పించే బలిని దేవుడు అంగీకరిస్తాడనీ, ఆ బలిని అతడు తప్పకుండా జ్ఞాపకం చేసికొంటాడనీ చెప్తుంది సీరా గ్రంథం - 36,6–7.

పూర్వవేదంలోని పై నాలు సందర్భాల్లో గూడ జ్ఞప్తికి తెచ్చేవాడు నరుడు, జ్ఞప్తియందుంచుకొనేవాడు దేవుడు. ఇక నూతవేదంలోని సందర్భాలు కూడ కొన్ని చూద్దాం.

1. తొలినాటి క్రైస్తవులంతా యూదులు. అన్యజాతులలో నుండి మొదటిసారిగా క్రైస్తవులలో చేరినవాడు రోమను సైన్యాధికారి కొర్నేలి. ఇతని ప్రార్థనా దానధర్మాలూ "జ్ఞాపకార్థంగా" దేవుని సన్నిధిలోకి చేరాయి - అచ 10,4. అనగా అతని ప్రార్ధనం పూర్వవేదంలోని లేవీయకాండం 2,2 పేర్కొనే ధాన్యబలిలాగా దేవుని సన్నిధిలోకి చేరింది. ప్రభువు అతని ప్రార్థనను తప్పక జ్ఞాపకం చేసికొంటాడని భావం.

2. సీమోను ఇంటిలో భోజనం చేసే క్రీస్తు శిరస్సుని ఓ 息 అత్తరుతో అభిషేకించింది. సువార్త ప్రచారంలోకి వచ్చేకాడల్లా ఈ భక్తురాలి పుణ్యక్రియ కూడ ఆమె జ్ఞాపకార్థంగా ప్రచారంలోకి వస్తుంది. ఇక్కడ ఆమెను జ్ఞప్తియందుంచుకొనేది నరులు కాదు, దేవుడు. ఆమె పుణ్యక్రియ ఓ ధాన్యబలిలాగ దేవుని సన్నిధిని చేరుతుందని భావం - పూర్కు 14,9.

3. పౌలు తెస్సలోనియుల విశ్వాసాన్నీ ప్రేమనీ దేవుని యెదుట జ్ఞాపకార్థంగా సమర్పించాడు. అనగా ఆ ప్రజల భక్తిని దేవుడు 35 వుంచుకొంటాడని భావం- 1 తెస్స 1.2-3.

ఈ ఉదాహరణలన్నిటిలో కూడ జ్ఞప్తియందుంచుకొనే కర్త దేవుడే ఈ ఉదాహరణలను చూచాక యిక అంత్యభోజన వాక్యాలను పరిశీలిద్దాం. క్రీస్తు రొట్టెనూ ద్రాక్షసారాయాన్నీ ఆశీర్వదించి శిష్యులకిచ్చిన పిమ్మట "మీరు దీన్ని నా జ్ఞాపకార్థంగా చేయండి" అన్నాడు - 1కొ 11,24. లూకా 22,19.

ఇక్కడ "దీన్ని అంటే దేన్ని? క్రీస్తు చేసిన కార్యాన్ని అతడు రొట్టెను తీసికొని దేవుణ్ణి స్తుతించి దాన్ని విరిచి శిష్యులకిచ్చాడు. వాళ్ళను తినమన్నాడు. అలాగే పాత్రను తీసికొని, దేవునికి వందనాలర్పించి, దాన్ని శిష్యులకిచ్చి పానం చేయమన్నాడు. ఈ క్రియలన్నిటినీ క్రీస్తు చేసినట్లుగానే తర్వాత శిష్యులు కూడన చేయాలి.