పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు "నా జ్ఞాపకార్థంగా చేయండి" అన్నాడు. పైన మనం పేర్కొన్నపూర్వ నూత్నవేద ఉదాహరణలను బట్టి ఈ మాట అర్థమేమిటో మనకు తెలుసు. దివ్యసత్రసాద బలి క్రీస్తు జ్ఞాపకార్ధం జరగాలి. అనగా భక్తులు క్రీస్తు మరణిత్తానాలను తండ్రికి జ్ఞాపకం చేస్తారు. ఆ తండ్రి తన కుమారుని మరణోత్తానాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఆ కుమారుడ్డి విశ్వసించే భక్తులందరినీ కనికరిస్తాడు. ప్రతి పూజలోను ఈలా తండ్రి సిలువబలినర్పించే శ్రీసభను కరుణిస్తూంటాడు.

యూదుల సంప్రదాయం ప్రకారం, భక్తులు తమ ఆరాధనంలో భగవంతుడు పూర్వం జరిగించిన ఓ సంఘటనను గుర్తుకు తెచ్చుకొనేపడెల్లా ఆ సంఘటనం మల్లా వాళ్ళ మధ్యలో నూత్నంగా జరుగుతుంది. కనుక పూర్వవేదంలో యూదులు ఐగుప్త దాస్యవిముక్తిని గుర్తుకి తెచ్చుకొని పాస్క ఉత్సవాన్ని జరుపుకొనేపుడెల్లా వాళ్ళకు మళ్ళా దాస్యవిముక్తి రక్షణమూ సిద్ధించేది. పూర్వం ఆ దాస్యవిముక్తిని కలిగించిన ప్రభువు వాళ్ళకు మళ్ళా ప్రత్యక్షమై వాళ్ళను దీవించేవాడు. ఇదే "జ్ఞాపకార్థం" యొక్క ఫలితం. ఇదే నియమం నూతవేదానికి గూడ వర్తిస్తుంది. ఈనాడు మనం కల్వరిబలిని “జ్ఞాపకార్ధంగా" మన మధ్యలో జరుపుకొనేపడెల్లా, అనగా మనం పూజను జరుపుకొనేపడెల్లా, పూర్వం సిలువ మరణాన్ని అనుభవించి ఉత్తానమైన క్రీస్తు నేడు మన మధ్యలో ప్రత్యక్షమౌతాడు. అలా ప్రత్యక్షమై మనకు తన రక్షణాన్ని దయచేస్తాడు. కనుక నాటి పాస్మబలి గాని నేటి సిలువ బలి గాని కేవలం పూర్వ సంఘటనాలను గుర్తుకి తెచ్చుకొనేవి మాత్రమే కావు. ఆ సంఘటనాలను మళ్ళా మన మధ్యలో ప్రత్యక్షం రక్షణమూర్తీ ఐన దేవుణ్ణి మళ్ళా మన మధ్య సాక్షాత్కారం చేసేవి. కనుక పాఠకులు "ఈ జ్ఞాపకార్థం" అన్న భావాన్ని జాగ్రత్తగా గుర్తించాలి.

పూజలో మనం క్రీస్తు మరణోత్తానాలను తండ్రికి జ్ఞాపకం చేసేపుడు రెండు పనులు చేస్తాం. మొదటిది, ఆ క్రీస్తు ద్వారా మనలను రక్షించినందులకు తండ్రికి వందనాలర్పిస్తాం. రెండవది, ఆ క్రీస్తుని చూచి ఇప్పడు కూడ మనలను కాచి కాపాడాలని తండ్రికి మనవి చేస్తాం.

3. క్రీస్తు మరణాన్ని ప్రకటించడం

భక్తులు ఆ రొట్టెను తిని ఆ పాత్రను పుచ్చుకొనేపడెల్లా, ప్రభువు మళ్ళా రెండవసారి విజయం చేసిందాకా గూడ అతని మరణాన్ని ప్రకటిస్తారు అన్నాడు పౌలు 1కొరి 11,26. మనం చేసే "జ్ఞాపకార్థం" ఫలితంగా క్రీస్తు మరణాన్ని ప్రకటిస్తాం. ఇక్కడ "ప్రకటించడం" అంటే లోకానికి క్రీస్తుని బోధించడమని భావం కాదు. మరి ఉత్తాన క్రీస్తుని మన మధ్యలో,