పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హీబ్రూ బెరకాలో మూడంశాలు వుండేవి. 1. ప్రభువుని స్తుతించమని భక్త సమాజాన్ని హెచ్చరించేవాళ్ళ 2. ఆ స్తుతికి కారణం ತಖಓವ್ಳ್ಳಿ. ప్రభువు తన ప్రజలను రక్షించాడు కనుక అతన్నిస్తుతించాలి. భక్తసమాజం ఆ ప్రభువు దయచేసిన రక్షణాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆ రక్షణాన్ని ఇప్పడు కూడ భక్తులు అనుభవిస్తూనే వున్నారు. 3. అంత్యస్తుతి.

కనుక హీబ్రూ ప్రజలు ప్రభువు తమకు దయచేసిన రక్షణానికి గాను కృతజ్ఞతాభావంతోను ఉత్సాహంతోను భక్తసమాజంలో అతన్ని కొనియాడిస్తుతించేవాళ్లు. ఈ సంప్రదాయాన్ని మనసులో పెట్టుకొనే కడపటి భోజనంలో రొట్టెనూ ద్రాక్షసారాయాన్నీ ఆశీర్వదించడానికి ముందు క్రీస్తు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు - మత్త 26,26–27.

2. జ్ఞాపకార్థం

పై కృతజ్ఞతాస్తుతిలో ఒక అంశం దేవునికి తాను దయచేసిన రక్షణాన్ని జ్ఞాపకం చేయడం. భక్తులు ప్రభువుకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించేపుడు అతడు తమకు దయచేసిన రక్షణాన్ని అతనికి జ్ఞాపకం చేసేవాళ్లు, అందుకు వందనాలు చెప్పేవాళ్ళు తమకు కావలసిన ఇతర వరాలను కూడ అతని నుండి అడుగుకొనేవాళ్ళు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

1. ప్రభువు యిస్రాయేలీయులను ఫరో దాస్యం నుండి విడిపించాడు. ఈ సంఘటనాన్ని పరస్కరించుకొని వాళ్ళ తొలి పాస్కపండుగను ఐగుప్తలోనే జరుపుకొన్నారు. కాని తర్వాత వాళ్ళ వాగ్దత్తభూమిలో స్థిరపడిన పిదప అక్కడ కూడ ఏటేట ఈ పండుగను జరుపుకోవాలి. ఎందుకు? ప్రభువుకి కృతజ్ఞత చూపడానికి, అతడు దయచేసిన దాస్యవిముక్తి అనే వరాన్ని అతనికి జ్ఞప్తికి తేవడానికి. అలా జ్ఞప్తికి తెచ్చి ప్రభువు ఆనాడు చేసిన వాగ్దానాలను ఈనాడు కూడ నిలబెట్టుకోవాలని మనవి చేసికోవడానికి - నిర్ణ 12,14, ఈలాగే యూదులు వాగత్తభూమిలో పాస్కపండుగను జరుపుకొనేపుడు పొంగని రొట్టెలను తినాలి. ఈ ఆచారం కూడ ప్రభువుకి తాను దయచేసిన రక్షణాన్ని છૂર્કંડે తేవడం కొరకే - నిర్గ13,7-9. ఈ సందర్భంలో రెండంశాలు ముఖ్యం. మొదటిది, భక్తులు పూర్వరక్షణాన్ని దేవునికి జ్ఞప్తిచేసి అతనికి వందనాలు అర్పించడం. రెండవది, ప్రస్తుతం కూడ దేవుడు తమ్మ కాపాడాలని మనవిచేసుకోవడం. కనుక ఇక్కడ కృతజ్ఞతా మనవీ రెండూ వున్నాయి.

2. యూదులు దేవునికి ధాన్యబలి అర్పించేవాళ్ళు దీనిలో గోదుమ పిండిని ఓలివు నూనెతోను సాంబ్రాణితోను కలిపి పీఠంమీద దహించేవాళ్ళు ఈ బలికూడ దేవునికి తాను ప్రసాదించిన రక్షణాన్నీ తాను దయచేసిన వాగ్గానాలను జ్ఞాపకం చేయడం కోసమే .2 ,2