పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంటె మనం చేయదగిన గొప్ప పుణ్యకార్యమేమీ లేదు. ఈపూజలో భక్తిభావంతో క్రీస్తుని తండ్రికి అర్పిస్తే, క్రీస్తుతోపాటు మనలను మనం ఆ తండ్రికి అర్పించుకొంటే, మన జీవితం ధన్యమౌతుంది.

4. రక్తపాతం ద్వారా తప్పితే పాపవిమోచనం జరగదని చెప్తుంది హెబ్రేయులు జాబు -9,22. కనుక క్రీస్తు స్వీయరక్తాన్నిచిందించి మనకు పాపవిముక్తి కలిగించాడు. పూర్వవేదంలో పశువుల నెత్తురు పాపవిమోచనం కలిగిస్తే నూత్నవేదంలో తండ్రికి ప్రీతిపాత్రుడూ పవిత్రుడూ ఐన క్రీస్తు నెత్తురు మనకు అంతకంటె అదనంగానే పాపవిమోచనం కలిగిస్తుంది. కనుక "అనేకుల పాపక్షమాపణానికి చిందబడనున్న నా రక్తం ఇది” అన్న ప్రభువుకి మనం ఎంతైనా కృతజ్ఞలమై యుండాలి.

5. అంత్యభోజనానికి 89& పూర్వవేదంలోని పాస్కనిబంధన బలులతో సంబంధం వుంది. ఇటు నూత్నవేదంలోని సిలువ బలితోను, పూజబలితోను సంబంధం వుంది. కనుక ఈ కడపటి భోజనం భావాన్ని మనం జాగ్రత్తగా గుర్తించాలి,

2. జాపకారం

“ఇది మీ కొరకు ఉద్దేశింపబడిన నా శరీరం. మీరు నా జ్ఞాపకార్థంగా ಡಿನಿನಿ చేయండి” - 1కొ 11,24.

పూర్వ నూతవేదాల్లో "జ్ఞాపకార్థం" అనే భావం ఒకటుంది. ఈ భావం ప్రకారం పూర్వం జరిగిపోయిన ఓ సంఘటనం ఇప్పడు మనకు మళ్ళా ప్రత్యక్షమౌతుంది. కనుక పూర్వం జరిగిన సిలువబలి ఇప్పడు మళ్ళా మన పూజలో ప్రత్యక్షమౌతుంది. ప్రస్తుతాధ్యాయంలో ఈ జ్ఞాపకార్థం అనే భావాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ నాల్గంశాలను తిలకిద్దాం.

1. కృతజ్ఞతా స్తుతి

దివ్యసత్రసాదానికి గ్రీకుభాషలో యూకరిస్ట్ అని పేరు. ఈ పదానికి కృతజ్ఞతాస్తుతి అని అర్థం. కాని ఈ పేరు దీనికి ఏలా వచ్చింది? హీబ్రూ ప్రజలు పాస్మబలి మొదలైన ఆరాధన కార్యక్రమాల్లో ప్రభువుని స్తుతించేవాళ్ళు ఈ స్తుతికి హీబ్రూ భాషలో "బెరకా" అని పేరు. ఈ పదం నుండే యూకరిస్ట్ అనే పదం ఉద్భవించింది. తండ్రి క్రీస్తు ద్వారా 'దయచేసిన రక్షణానికి స్తుతి చెల్లించడం దివ్యసత్ర్పసాదంలో ప్రధానాంశం.